Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Survey Results On Bihar Assembly Elections Released

Bihar: ఈసారి బీహార్ ప్రజలు ఎటువైపు అంటే..! తాజా రిపోర్టులు వచ్చేశాయ్!

Published Date :July 7, 2025 , 12:47 pm
By Suresh Maddala
  • ఈసారి బీహార్ ప్రజలు ఎటువైపు..!
  • తాజా రిపోర్టులు వచ్చేశాయ్!
Bihar: ఈసారి బీహార్ ప్రజలు ఎటువైపు అంటే..! తాజా రిపోర్టులు వచ్చేశాయ్!
  • Follow Us :
  • google news
  • dailyhunt

బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇక అన్ని పార్టీలు కూడా ఎన్నికల చదరంగంలోకి దిగేశాయి. ఈసారి నువ్వానేనా? అన్నట్టుగా ప్రధాన పార్టీలన్నీ తలపడతున్నాయి. ఇక ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా తేజస్వి యాదవ్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇంకోవైపు అధికారం కోసం ప్రశాంత్ కిషోర్ కూడా ప్రయత్నిస్తున్నారు. ఇలా ఎవరికి వారే ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటున్నారు. రాష్ట్ర జనాభాలో అత్యధికంగా యువత ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. 90 శాతం ఓట్లు యువతపైనే ఆధారపడి ఉన్నాయి. దీంతో యువతే లక్ష్యంగా ప్రధాన పార్టీలు హామీలు కుమ్మరిస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Rashmika : వృత్తి కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేశా..

ఇక తాజాగా బీహార్ ఎన్నికలపై ఆయా సంస్థలు చేసిన సర్వేలు బయటకు వస్తున్నాయి. ఇంక్‌ఇన్‌సైట్ విడుదల చేసిన అభిప్రాయ సేకరణ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ సర్వేలో మరోసారి అధికార ఎన్డీఏకే ప్రజలు పట్టం కడుతున్నట్లు తెలిపింది. దాదాపు 48.9 శాతం మంది ఎన్డీఏకు మద్దతు ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ (యునైటెడ్), ఇతర చిన్న పార్టీలతో కూడిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ మెజారిటీ సాధించే దిశగా పయనిస్తోందని సంస్థ పేర్కొంది. 35.8 శాతం మంది రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్, వామపక్ష పార్టీల మహాఘటబంధన్‌కు ఓటు వేస్తామని చెప్పారని స్పష్టం చేసింది.

ఇది కూడా చదవండి: Bengaluru: రేణుకాస్వామి హత్య తరహాలో యువకుడిపై దాడి.. దర్శనే తమకు ప్రేరణ అన్న నిందితులు

ఆశ్చర్యం ఏంటంటే ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్‌కు ఎక్కువ మద్దతు లభించింది. సీఎంగా తేజస్వి యాదవ్‌నే కోరుకున్నారు. రెండో స్థానంలో నితీష్ కుమార్ ఉన్నారు. ఇక 43.6 శాతం మంది పురుషులు ఎన్డీఏకే మద్దతు ఇచ్చారు. అలాగే మహిళలు కూడా బీజేపీ కూటమికే సపోర్టు చేశారు. ఎన్డీఏ కూటమికి ఓటు వేస్తామని చెప్పారు కానీ.. నితీష్‌ను మాత్రం మరోసారి సీఎంగా అంగీకరించలేదు. 38.3 శాతం మంది తేజస్విని సీఎంగా కావాలని కోరుకోగా.. 35.6 శాతం మంది నితీష్‌ను కోరుకున్నారు. ఇక 4.6 శాతం మంది చిరాగ్ పాశ్వాన్‌ను, 2.3 శాతం మంది ప్రశాంత్ కిషోర్‌ను ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. 12.3 శాతం మంది బీజేపీ నుంచి కొత్త ముఖ్యమంత్రిని చూడాలని కోరుకున్నారు. యాదవులు, షెడ్యూల్డ్ తెగలు, ముస్లింలు తేజస్వి కూటమికి మద్దతు తెల్పగా.. మిగతా అన్ని సంఘాలు ఎన్డీఏ వైపు ఉన్నాయి.

బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నవంబర్-డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Assembly elections released
  • bihar
  • bjp
  • JDU
  • nitish kumar

తాజావార్తలు

  • Off The Record: బీఆర్ఎస్‌ కంచుకోట.. సిద్దిపేటలో బలహీనపడుతున్న కాంగ్రెస్..

  • Earthquake: ఢిల్లీలో భూకంపం.. ప్రాణ భయంతో వీధుల్లోకి పరుగులు పెట్టిన జనాలు..

  • DA Hike: ప్రభుత్వ ఉద్యోగులు,పెన్షనర్లకు శుభవార్త.. ఈ సారి భారీగానే పెరుగుదల..!?

  • Off The Record: తెలంగాణ ఈఎన్సీ జనరల్ పోస్ట్ కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ..

  • Toothpaste: టూత్ పేస్ట్ ఫ్యాక్టరీ సీజ్.. 130 కిలోల పేస్ట్‌ స్వాధీనం..

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions