బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడింది. త్వరలోనే ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఇక అన్ని పార్టీలు కూడా ఎన్నికల చదరంగంలోకి దిగేశాయి. ఈసారి నువ్వానేనా? అన్నట్టుగా ప్రధాన పార్టీలన్నీ తలపడతున్నాయి. ఇక ముఖ్యమంత్రి పీఠమే లక్ష్యంగా తేజస్వి యాదవ్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఇంకోవైపు అధికారం కోసం ప్రశాంత్ కిషోర్ కూడా ప్రయత్నిస్తున్నారు. ఇలా ఎవరికి వారే ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటున్నారు. రాష్ట్ర జనాభాలో అత్యధికంగా యువత ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. 90 శాతం ఓట్లు యువతపైనే ఆధారపడి ఉన్నాయి. దీంతో యువతే లక్ష్యంగా ప్రధాన పార్టీలు హామీలు కుమ్మరిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Rashmika : వృత్తి కోసం వ్యక్తిగత జీవితాన్ని త్యాగం చేశా..
ఇక తాజాగా బీహార్ ఎన్నికలపై ఆయా సంస్థలు చేసిన సర్వేలు బయటకు వస్తున్నాయి. ఇంక్‌ఇన్‌సైట్ విడుదల చేసిన అభిప్రాయ సేకరణ ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ సర్వేలో మరోసారి అధికార ఎన్డీఏకే ప్రజలు పట్టం కడుతున్నట్లు తెలిపింది. దాదాపు 48.9 శాతం మంది ఎన్డీఏకు మద్దతు ఇచ్చారు. భారతీయ జనతా పార్టీ, జనతాదళ్ (యునైటెడ్), ఇతర చిన్న పార్టీలతో కూడిన నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ మెజారిటీ సాధించే దిశగా పయనిస్తోందని సంస్థ పేర్కొంది. 35.8 శాతం మంది రాష్ట్రీయ జనతాదళ్, కాంగ్రెస్, వామపక్ష పార్టీల మహాఘటబంధన్‌కు ఓటు వేస్తామని చెప్పారని స్పష్టం చేసింది.
ఇది కూడా చదవండి: Bengaluru: రేణుకాస్వామి హత్య తరహాలో యువకుడిపై దాడి.. దర్శనే తమకు ప్రేరణ అన్న నిందితులు
ఆశ్చర్యం ఏంటంటే ముఖ్యమంత్రిగా తేజస్వి యాదవ్‌కు ఎక్కువ మద్దతు లభించింది. సీఎంగా తేజస్వి యాదవ్‌నే కోరుకున్నారు. రెండో స్థానంలో నితీష్ కుమార్ ఉన్నారు. ఇక 43.6 శాతం మంది పురుషులు ఎన్డీఏకే మద్దతు ఇచ్చారు. అలాగే మహిళలు కూడా బీజేపీ కూటమికే సపోర్టు చేశారు. ఎన్డీఏ కూటమికి ఓటు వేస్తామని చెప్పారు కానీ.. నితీష్‌ను మాత్రం మరోసారి సీఎంగా అంగీకరించలేదు. 38.3 శాతం మంది తేజస్విని సీఎంగా కావాలని కోరుకోగా.. 35.6 శాతం మంది నితీష్‌ను కోరుకున్నారు. ఇక 4.6 శాతం మంది చిరాగ్ పాశ్వాన్‌ను, 2.3 శాతం మంది ప్రశాంత్ కిషోర్‌ను ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. 12.3 శాతం మంది బీజేపీ నుంచి కొత్త ముఖ్యమంత్రిని చూడాలని కోరుకున్నారు. యాదవులు, షెడ్యూల్డ్ తెగలు, ముస్లింలు తేజస్వి కూటమికి మద్దతు తెల్పగా.. మిగతా అన్ని సంఘాలు ఎన్డీఏ వైపు ఉన్నాయి.
బీహార్‌లో మొత్తం 243 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. నవంబర్-డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది.
