Supreme Court: వీధికుక్కలకు సంబంధించిన కేసును గురువారం జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్వి అంజరియాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ కొనసాగించింది. జంతు ప్రేమికులు, కుక్క కాటు బాధితులు, జంతు హక్కుల కార్యకర్తలు తమ వాదనల్ని సమర్పించారు. జంతు సంక్షేమ సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ న్యాయవాది సియూ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వీధి కుక్కులు ఢిల్లీలో సమతుల్యతను కాపాడుతున్నాయని, ఇవి ఎలుకలు, కోతుల ముప్పును రక్షిస్తున్నాయని, కుక్కలను హఠాత్తుగా తొలగిస్తే ఎలుకల జనాభా పెరుగుతుందని ఆయన వాదించారు. స్టెలిలైజేషన్ చేసి, అదే ప్రాంతాల్లో తిరిగి వదిలితే బాగుంటుందని వాదించారు.
Read Also: Mamat Banerjee: ఐ-ప్యాక్‌పై ఈడీ దాడులు.. మమత బెనర్జీ పరుగో పరుగు.. చేతిలో ‘‘గ్రీన్ ఫైల్’’
అయితే, ఈ వ్యాఖ్యలపై జస్టిస్ మెహతా మాట్లాడుతూ.. కుక్కలు పిల్లులకు శత్రువులు, ఎలుకలకు శత్రువులకు పిల్లులు శత్రువులు, అందుకే మనం ఎక్కువ పిల్లులను ప్రోత్సహించాలి అని ఆయన అన్నారు. కుక్కల బదులుగా పిల్లులను పెంచుకోవాలని సూచించారు. అయితే, వీధుల్లో ఉన్న కుక్కల్ని తరలించమని తాము ఆదేశించలేదని, కేవలం సంస్థలు, కార్యాలయాల నుంచి మాత్రమే తరలించమన్నామని సుప్రీకోర్టు తెలిపింది. కుక్కలు భయపడే మనిషి వాసనను కుక్క పసిగట్టగలదని, ఈ విషయాన్ని గ్రహించే అవి దాడులు చేస్తాయని, ఇది తమ వ్యక్తిగత అనుభం నుంచి మాట్లాడుతున్నామని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
