Supreme Court: వీధికుక్కలకు సంబంధించిన కేసును గురువారం జస్టిస్ విక్రమ్ నాథ్, సందీప్ మెహతా, ఎన్వి అంజరియాలతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ కొనసాగించింది. జంతు ప్రేమికులు, కుక్క కాటు బాధితులు, జంతు హక్కుల కార్యకర్తలు తమ వాదనల్ని సమర్పించారు. జంతు సంక్షేమ సంఘాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సీనియర్ న్యాయవాది సియూ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. వీధి కుక్కులు ఢిల్లీలో సమతుల్యతను కాపాడుతున్నాయని, ఇవి ఎలుకలు, కోతుల ముప్పును రక్షిస్తున్నాయని, కుక్కలను హఠాత్తుగా తొలగిస్తే ఎలుకల…