Supreme Court: వైవాహిక వివాద కేసులో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘భార్య,భర్తను తన చుట్టూ తిప్పించుకోకూడదు’’ అని వ్యాఖ్యానించింది. భార్యాభర్తలు ఇద్దరు తన పిల్లల కోసం ఈగోలను పక్కన పెట్టాలని కోరింది. న్యాయమూర్తులు బీవీ నాగరత్న, ఆర్ మహదేవన్‌లతో కూడిన ధర్మాసనం పిల్లల సంక్షేమానికి తల్లిదండ్రులు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పింది. మధ్యవర్తిత్వం ద్వారా విభేదాలను పరిష్కరించుకోవాలని సూచించింది.
Read Also: Dharmapuri Arvind : జూబ్లీహిల్స్ ఓట్ల చోరీపై కేటీఆర్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయి
ఈ కేసులో భార్యాభర్తలు ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు. భర్త ఢిల్లీలో రైల్వేలో పనిచేస్తుండగా, భార్య పాట్నాలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగం చేస్తోంది. ఆమె తన తల్లిదండ్రులతో నివసిస్తోంది. అయితే, భర్త తన అత్తమామలతో ఉండటం లేదని భార్య కుటుంబం భర్తపై కేసు పెట్టింది. భర్త తాను అత్తమామల ఇంట్లో ఉండలేనని చెప్పడంతో భార్య కేసునమోదు చేసింది. భర్తను మానసికంగా కించపరిచిన తర్వాత ఇద్దరు ఎలా కలిసి ఉండగలరు అని కోర్టు ప్రశ్నించింది.
2018లో వివాహమైన ఈ జంటకు ఐదేళ్ల కుమార్తె, మూడేళ్ల కుమారుడు ఉన్నారు. 2023 నుంచి వీరిద్దరు విడివిడిగా ఉంటున్నారు. ఇద్దరి మధ్య పెరుగుతున్న విభేదాలు పిల్లలపై ప్రభావితం చూపిస్తాయని సుప్రీంకోర్టు ఇద్దరికి నచ్చచెప్పే ప్రయత్నం చేసింది.
