Site icon NTV Telugu

Supreme Court: ‘‘కన్స్యూమర్ ఈస్ కింగ్’’.. కస్టమర్లకు హోటళ్ల వివరాలు తెలుసుకునే హక్కు ఉంది..

Kanwar

Kanwar

Supreme Court: కన్వర్ యాత్రం మార్గంలోని ఉన్న హోటళ్లు , రెస్టారెంట్లలో క్యూఆర్ కోడ్‌లను ప్రదర్శించాలని ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రభుత్వాలు ఆదేశించాయి.అయితే, ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ కొందరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు ఈ పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు, రెండు రాష్ట్రాల ఆదేశాల్లో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. క్యూఆర్ కోడ్ ఆదేశాలకు వ్యతిరేకంగా దాఖలు చేసిన దరఖాస్తును సుప్రీంకోర్టు కొట్టివేసింది. కన్వర్ యాత్ర చివరి రోజు ఇదే అని పేర్కొంది. అయితే, ప్రభుత్వం విక్రేతల పేర్లు, గుర్తింపును వెల్లడించమని బలవంతం చేయగలదా అనే ప్రధాన అంశాన్ని కోర్టు పెండింగ్‌లో ఉంచింది.

Read Also: Tamil Nadu: అజిత్ కుమార్ కస్టడీ డెత్.. రూ.25 లక్షలు పరిహారం చెల్లించాలని హైకోర్టు ఆదేశం..

అధికారులు జారీ చేసిన ఆదేశాన్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన మధ్యంతర దరఖాస్తులను జస్టిస్ ఎంఎం సుందరేష్, జస్టిస్ ఎన్కె సింగ్‌లతో కూడిన ధర్మాసనం కొట్టివేసింది. ‘‘వినియోగదారుడే రాజు’’ అని చెబుతూ, రెస్టారెంట్లలో వడ్డించే ఆహారంలో ఉపయోగించే పదార్థాలు, తయారీ పద్ధతులను గురించి, ఆ స్థలంలో గతంలో మాంసాహార ఆహారాన్ని అందించారా.? లేదా.? అనే దానితో సహా అన్నింటిని వినియోగదారుడు తెలుసుకునే హక్కు ఉందని సుప్రీంకోర్టు సమర్థించింది. యాత్ర ప్రయోజనం కోసం మాత్రమే, ఎవరైనా మాంసాహారం నుంచి శాఖాహరంగా మారితే, వినియోగదారుడు తెలుసుకోవాలని సుప్రీంకోర్టు పేర్కొంది.

చట్టం ప్రకారం విక్రేతలు తమ లైసెన్స్‌లు మరియు రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌లను ప్రదర్శించాలని కూడా ధర్మాసనం స్పష్టం చేసింది. విద్యావేత్త అపూర్వానంద్ ఝాతో సహా వివిధ పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వి, హుజెఫా అహ్మది వాదనలు వినిపించారు. యూపీ ప్రభుత్వం తరుపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి తన వాదనలు వినిపించారు. పిటిషనర్ల తరుపున సింఘ్వీ వాదిస్తూ.. మైనారిటీ రెస్టారెంట్లను బహిష్కరించే కుట్ర ఉందని వాదించారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు, “వినియోగదారుడే రాజు” అని ఆయన వ్యాఖ్యానించారు, ఒక హోటల్ శ్రావణ మాసంలో మాత్రమే శాఖాహార ఆహారాన్ని అందిస్తుందా లేదా సంవత్సరం పొడవునా వర్తిస్తుందా అని తెలుసుకునే హక్కు వారికి ఉందని చెప్పింది.

Exit mobile version