కన్వర్ యాత్రకు యూపీ అనుమతులు ఇవ్వడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా దృష్ట్యా అనుమతులు ఎలా ఇస్తారని ప్రశ్నించింది. సుమోటోగా కేసును స్వీకరించిన సుప్రీంకోర్టు యూపీకి, కేంద్రానికి నోటీసులు జారీచేసింది. అయితే, ఈ యాత్రకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఇప్పటికే అనుమతి నిరాకరించిన సంగతి తెలిసిందే. మహాశివుడి భక్తులు ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్, గోముఖ్, గంగోత్రికి వెళ్లి అక్కడి పవిత్రమైన గంగానది జలాలను తీసుకొని వస్తారు. వాటిని స్థానికంగా ఉండే శివాలయంలో మహాశివునికి అభిషేకిస్తారు. ఈ యాత్ర ప్రతి ఏడాది కన్నుల పండుగగా నిర్వహిస్తుంటారు. వేలాది మంది భక్తులు ఈ యాత్రలో పాల్గొంటారు. కానీ, ఈ ఏడాది కరోనా కారణంగా యాత్రకు తక్కువ మందికి మాత్రమే అనుమతించినట్టు యూపి ప్రభుత్వం చెబుతున్నది.