Maruti Suzuki e-Vitara: మారుతి సుజుకీ e Vitara భరత్ NCAPలో 5-స్టార్ రేటింగ్‌ను సాధించింది. ఈ కారు సుజుకీ కొత్త Heartect-e ప్లాట్‌ఫామ్‌పై తయారైంది. ఇందులో లెవెల్-2 ADAS సిస్టమ్‌తో పాటు ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు ఉన్నాయి. కారు బాడీ నిర్మాణంలో 60% కంటే ఎక్కువ అల్ట్రా హై-టెన్సైల్, హై-టెన్సైల్ స్టీల్ వాడారు. అడల్ట్ సేఫ్టీ టెస్టుల్లో e Vitara 32లో 31.49 పాయింట్లు సాధించింది. ఫ్రంట్ ఆఫ్సెట్ టెస్టులో 15.49/16, సైడ్ మూవబుల్ డిఫార్మబుల్ బ్యారియర్ టెస్టులో 16/16 స్కోర్ వచ్చింది.
READ MORE: Kollywood : AVM స్టూడియోస్ సంస్థ అధినేత AVM శరవణన్ కన్నుమూత
మారుతి సుజుకీ ప్రకారం.. ఈ కారు బ్యాటరీకి ప్రత్యేక రక్షణ డిజైన్ ఉంది. బ్యాటరీ మౌంటింగ్ నిర్మాణం ఎనర్జీ షాక్‌ను శోషించేటట్లు రూపొందించారు. చైల్డ్ సేఫ్టీ టెస్టులో e Vitara మొత్తం 49 పాయింట్లలో 43 పాయింట్లు సాధించింది. డైనమిక్ స్కోర్ 24/24, CRS ఇన్‌స్టాలేషన్ 12/12, వాహన మూల్యాంకన స్కోర్ 7/13 సాధించింది. ఈ కారు అన్ని వేరియంట్లలో ESC (ఇలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), కర్టెన్ ఎయిర్‌బ్యాగ్‌లు, పాదచారుల రక్షణ వ్యవస్థ, సీట్ బెల్ట్ రిమైండర్లు స్టాండర్డ్‌గా అందుబాటులో ఉన్నాయి. e Vitara, Dzire, Victoris, Invicto తరవాత 5-స్టార్ రేటింగ్ సాధించినమారుతి సుజుకీ నాల్గవ కారు.
కారు బ్యాటరీలు 60°C నుంచి మైనస్ 30°C వరకు సరైన పనితీరు ఇస్తాయని కంపెనీ చెబుతోంది. ఈ కారు భారత్‌లో తయారై ప్రపంచంలోని అనేక దేశాలకు ఎగుమతి అవుతోంది. యూరో NCAP టెస్టులో 4-స్టార్ రేటింగ్ వచ్చింది. ఇది BNCAP కంటే కఠినమైన ప్రమాణాలు ఉన్న టెస్ట్‌గా భావిస్తారు. టాప్-ఎండ్ e Vitaraలో ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, హిల్ హోల్డ్ కంట్రోల్, ABS-EBD, బ్రేక్ అసిస్టు, అన్ని చక్రాల మీద డిస్క్ బ్రేకులు, మల్టి-కోలిషన్ బ్రేకింగ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం, యాక్టివ్ కార్నింగ్ కంట్రోల్, ముందు సీట్ బెల్ట్ ప్రీ-టెన్షనర్లు విత్ ఫోర్స్ లిమిటర్స్, సీట్ బెల్ట్ హెయిట్ అడ్జస్టర్, మూడు పాయింట్ల సీట్ బెల్ట్‌లు, ISOFIX చైల్డ్ సీట్ అంకరేజ్‌లు, 360° కెమెరా, ముందు-వెనుక పార్కింగ్ సెన్సర్లు, టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్, ఆటో-డిమ్మింగ్ ఇన్ సైడ్ మిర్రర్, ఎమర్జెన్సీ SOS కాల్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉంటాయి.
READ MORE: Tollywood : హిట్ దర్శకులను రిపీట్ చేస్తున్న టాలీవుడ్ హీరోలు
ADASలో ఆటోమేటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, ఫార్వర్డ్ కోలిషన్ వార్నింగ్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ ప్రివెన్షన్, లేన్ డిపార్చర్ వార్నింగ్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, అడాప్టివ్ హైబీమ్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, రియర్ క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. e Vitaraలో రెండు బ్యాటరీ ఆప్షన్లు(49 kWh, 61 kWh) ఉంటాయి. చిన్న బ్యాటరీతో సింగిల్ మోటార్, ఫ్రంట్ వీల్ డ్రైవ్ ఉంటుంది. పెద్ద బ్యాటరీతో డ్యూయల్ మోటార్, ఆల్-వీల్ డ్రైవ్ (AllGrip-e) ఉంటుంది. అయితే.. మారుతి సుజుకీ కంపెనీకి చెందిన ఇతర కార్లతో పోలిస్తే ఇది ఫ్యామిలీకి బెటరే!