ఎన్ని కఠిన చట్టాలొచ్చినా మృగాళ్లు మారడం లేదు. రోజురోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఎక్కడొక చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉంటున్నాయి. తాజాగా బెంగళూరులో కళాశాల క్యాంపస్‌లోనే పట్టపగలు విద్యార్థినిపై స్నేహితుడు దారుణానికి ఒడిగట్టాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇది కూడా చదవండి: Trump-Putin: 2 వారాల్లో పుతిన్ కలుస్తా.. ట్రంప్ వెల్లడి
దక్షిణ బెంగళూరులోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ క్యాంపస్‌లోని పురుషుల టాయిలెట్లో సహచర విద్యార్థిని(21)పై స్నేహితుడు జీవన్ గౌడ అత్యాచారానికి పాల్పడ్డాడు. అక్టోబర్ 10న కళాశాల ఏడవ అంతస్థులో బాధితురాలతో జీవన్ గౌడ మాట్లాడుతుండగా ఆమె ఆరవ ఫ్లోర్‌కు దిగేసింది. వెంటనే అతడు కూడా కిందకు దిగి పురుషుల బాత్రూమ్లోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. అయితే పరువు పోతుందన్న భయంతో ఆమె ఎవరికీ చెప్పుకోలేదు. తాజాగా ఆమె తన మహిళ స్నేహితులతో పంచుకోవడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. ఐదు రోజుల తర్వాత స్నేహితుల సలహా మేరకు అక్టోబర్ 15న పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 64 (అత్యాచారానికి శిక్ష) కింద కేసు నమోదు చేసి నిందితుడు జీవన్ గౌడను అరెస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Bengaluru: బెంగళూరులో దారుణం.. బి.ఫార్మ్ విద్యార్థిని గొంతుకోసి చంపిన యువకుడు
బాధితురాలు-నిందితుడు ఒకరినొకరు తెలుసున్నవాళ్లేనని.. కొన్ని వస్తువుల కోసం జీవన్ గౌడను బాధితురాలు కలిసిందని పోలీసులు తెలిపారు. అక్టోబర్ 10న భోజన విరామ సమయంలో ఆమెకు చాలాసార్లు ఫోన్ చేసి ఏడవ అంతస్తులోని ఆర్కిటెక్చర్ బ్లాక్ దగ్గరకు వచ్చి కలవమని కోరాడు. ఆమె అక్కడికి రాగానే బలవంతంగా ముద్దు పెట్టుకోవడానికి ప్రయత్నించాడు. దీంతో ఆమె లిఫ్ట్ ఉపయోగించి బయటకు వెళ్లడానికి ప్రయత్నించగా ఆమెను ఆరవ అంతస్తు వరకు అనుసరించి పురుషుల వాష్‌రూమ్‌లోకి లాక్కెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Delhi University: ఢిల్లీ వర్సిటీలో అమానుషం.. పోలీసులు చూస్తుండగా ప్రొఫెసర్‌ను చెంపదెబ్బ కొట్టిన విద్యార్థి
లైంగిక దాడి సమయంలో నిందితుడు వాష్‌రూమ్ తలుపు లాక్ చేసి ఆమె ఫోన్ మోగినప్పుడు లాక్ చేసాడని నివేదికలో పేర్కొన్నారు. లైంగిక దాడి మధ్యాహ్నం 1:30 నుంచి 1:50 గంటల మధ్య జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఈ సంఘటన తర్వాత ప్రాణాలతో బయటపడిన మహిళ తన ఇద్దరు స్నేహితులకు చెప్పింది. ఇక జీవన్ గౌడ బాధితురాలికి ఫోన్ చేసి ‘‘మాత్ర అవసరమా’’ అని అడిగినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. బాధితురాలు మొదట్లో ఫిర్యాదు చేయడానికి సంకోచించిందని, ఆమె భయపడి బాధపడినట్లు పోలీసులు తెలిపారు. తర్వాత తల్లిదండ్రులకు సమాచారం అందించగా హనుమంతనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇక గురువారం సంఘటనాస్థలిని పోలీసులు పరిశీలించారు. సంఘటన జరిగిన ప్రదేశంలో ఎటువంటి సీసీటీవీ కెమెరాలు లేనట్లుగా గుర్తించారు. దీంతో ఆధారాలు లభించలేదు. ఫోరెన్సిక్, డిజిటల్ ఆధారాలను పరిశీలిస్తున్నారు.
ఈ సంఘటన తీవ్ర రాజకీయ విమర్శలకు దారితీసింది. కర్ణాటకలో శాంతిభద్రతలు క్షీణించాయని ప్రతిపక్ష బీజేపీ ధ్వజమెత్తింది. కర్ణాటక శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు ఆర్. అశోక సోషల్ మీడియాలో.. ‘‘కర్ణాటకలో శాంతిభద్రతలు కుప్పకూలిపోయాయి. కేవలం నాలుగు నెలల్లోనే బాలికలపై 979 లైంగిక దాడులు జరిగాయి. బెంగళూరులో మాత్రమే 114 కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ నేరపూరిత నిష్క్రియాత్మకత కారణంగా మహిళలు, పిల్లలు భయంతో జీవిస్తున్నారు. మైసూరులో ఒక గిరిజన బాలికపై జరిగిన దారుణమైన అత్యాచారం, హత్య నుంచి కలబురగిలో ఒక లైబ్రేరియన్ విషాదకరమైన ఆత్మహత్య వరకు ఇది నైతిక మరియు పరిపాలనా వైఫల్యం.’’గా పేర్కొన్నారు. కర్ణాటకకు నిజ నిర్ధారణ బృందాన్ని పంపాలని కోరుతూ జాతీయ మహిళా కమిషన్ (NCW)కి అత్యవసర లేఖ రాసినట్లు తెలిపారు. ఇదిలా ఉంటే ఈ సంఘటనపై ఇప్పటికే కళాశాల యాజమాన్యం స్పందించలేదు.