Anti-rape Footwear: అత్యాచార నిరోధక ఫుట్‌వేర్‌ని రూపొందించిన కర్ణాటక విద్యార్థిని
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Student develops ‘anti-rape footwear’ with GPS: కర్ణాటకకు చెందిన పదో తరగతి విద్యార్థిని వినూత్నంగా ఆలోచించింది. ప్రస్తుతం సమాజంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు జరుగుతున్న నేపథ్యంలో ‘యాంటీ రేప్ ఫుట్‌వేర్’ని తయారు చేసింది. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడేందుకు ప్రయత్నించే కామాంధుల నుంచి తమను తాము రక్షించుకునేందుకు ఈ పాదరక్షలు ఉపయోగపడనున్నాయి. బాలికలు, మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించే నేరస్థుల నుంచి కాపాడుకునేందుకు ‘యాంటీ రేప్ ఫుట్‌వేర్’ ఉపయోగపడనుందని వీటిని రూపొందించిన విద్యార్థిని చెబుతోంది.
కర్ణాటక కలబురగికి చెందిన విజయలక్ష్మీ బిరాదార్(ఎల్) అనే పదో తరగతి విద్యార్థిని వీటిని రూపొందించారు. కలబురిగికి చెందిన ఎస్‌ఆర్‌ఎన్ మెహతా స్కూల్‌లో విజయలక్ష్మీ బిరాదార్ చదువుతోంది. ‘యాంటీ రేప్ ఫుట్‌వేర్’ బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడే వారికి విద్యుత్ షాక్ ఇవ్వడంతో పాటు జీపీఎస్ సౌకర్యం ఉంటుంది.
Also Read
- Amritsar ASI Harjit Singh: ASI హర్జీత్ సింగ్ హత్య కేసులో కీలక పరిణామం.. పోలీస్ ఎన్కౌంటర్లో నిందితుడు మృతి
- Saurav Gurjar: పెళ్లి పేరుతో మోసం.. ప్రముఖ నటుడు, రెజ్లర్ సౌరవ్ గుజ్జార్ అరెస్ట్..
- El Nino: భారత్‌కు రానున్న రోజుల్లో పెను ప్రమాదం.. ఎల్‌నితోపై శాస్త్రవేత్తల హెచ్చరిక..
- Karnataka: హృదయ విదారక ఘటన.. తల్లి శవంపై ఏడుస్తూ కనిపించిన రెండేళ్ల చిన్నారి
యాంటీ రేప్ ఫుట్‌వేర్ ఎలా పని చేస్తుంది?
నేరస్థుడు ఎవరైనా బాలికపై లైంగిక దాడి చేసే సమయంలో ఈ యాంటీ రేప్ ఫుట్‌వేర్ తో తన్నుతుందని.. దీంతో ఆ వ్యక్తి కరెంట్ షాక్ కు గురువుతాడని విజయలక్ష్మీ వివరించారు. బ్యాటరీల సాయంతో పాదరక్షల గుండా విద్యుత్ ప్రసరిస్తుందని.. నేరస్తులతో పోరాడేందుకు బాలికలకు ఇది సహాయపడుతుందని ఆమె వెల్లడించారు. ఇంతే కాకుండా దీంట్లో జీపీఎస్ ఫీచర్ కూడా కలిగి ఉన్నట్లు వెల్లడించారు. ఇది బాలిక లైవ్ లొకేషన్ ట్రాక్ చేసేందుకు తల్లిదండ్రులకు హెచ్చరికలు పంపుతుందని తెలిపారు.
ఈ ప్రాజెక్టు గురించి విజయలక్ష్మీ టీచర్ మాట్లాడారు.. 2018లో విజయలక్ష్మీ 7,8 తరగతులు చదువుతున్నప్పుడే ఈ ప్రాజెక్టుపై పనిచేయడం ప్రారంభించిందని వెల్లడించారు. విజయలక్ష్మీ అనేక అవార్డులను గెలుచుకున్నారని.. ఈ ప్రాజెక్టులో చాలా కాలం నుంచి పనిచేస్తున్నారని ఆమె వెల్లడించారు. ఇటీవల గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఇన్వేన్షన్ అండ్ ఇన్నోవేషన్ ఎక్స్‌పో అవార్డు గెలుచుకున్నట్లు వెల్లడించారు.
తాజావార్తలు
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
-
B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్‌కు పోటీగా స్వదేశీ B35
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!