NTV Telugu Site icon

Fishermen Arrest: 22 మంది భారతీయ మత్స్యకారుల్ని అరెస్ట్ చేసిన శ్రీలంక..

Sri Lanka Arrests Fishermen,

Sri Lanka Arrests Fishermen,

Fishermen Arrest: శ్రీలంక సముద్ర జలాల్లో నేడుంతీవు సమీపంలో చేపల వేట సాగిస్తున్న 22 మంది తమిళనాడు మత్స్యకారులను శ్రీలంక నావికాదళం ఆదివారం అరెస్ట్ చేసినట్లు రామేశ్వరం మత్స్యకారుల సంఘం తెలిపింది. శనివారం వీరంతా తమిళనాడు నుంచి పలువురు మత్స్యకారులు పడవల్లో సముద్రంలోకి వెళ్లినట్లు వారు తెలిపారు. పాల్క్ బే సముద్ర ప్రాంతంలోని నెడుందీవు సమీపంలో మత్స్యకారులు చేపడుతుండగా, శ్రీలంక నేవీ ఆదివారం తెల్లవారుజామున అక్కడకు చేరుకుని, తంగచిమడం మత్స్యకారులకు చెందిన మూడు పడవలను స్వాధీనం చేసుకున్నట్లు మత్స్యకారుల సంఘం తెలిపింది.

Read Also: Rajasthan: “గిరిజనులకు DNA టెస్ట్”.. విద్యాశాఖ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు..

ఈ ఘటనకు ముందు జూన్ 19న తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ మత్స్యకారుల సమస్య గురించి కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కి లేఖ రాశారు. శ్రీలంక అరెస్ట్ చేసిన మత్స్యకారులు, వారీ బోట్లను తక్షణమే విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
పుదుకొట్టై జిల్లాలోని కొట్టైపట్టినం ఫిషింగ్ హార్బర్ నుంచి తమ రాష్ట్రానికి చెందిన నలుగురు మత్స్యకారులను శ్రీలంక నేవీ మంగళవారం అరెస్ట్ చేసినట్లు స్టాలిన్ కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. ఇలాంటి ఘటనలు మత్స్యకారుల్లో ఆందోళన, భయాన్ని నెలకొల్పుతున్నాయని సీఎం చెప్పారు. అంతకుముందు ఏప్రిల్ నెలలో తమిళనాడుకు చెందిన మొత్తం 19 మంది మత్స్యకారులను శ్రీలంక విడిచిపెట్టింది. వీరిని మార్చ్ 6న వీరిని శ్రీలంక నేవీ అరెస్ట్ చేసింది.