Site icon NTV Telugu

IMD Alert: దక్షిణాది రాష్ట్రాలకు వర్ష సూచన.. ఏఏ రాష్ట్రాలంటే..!

Imdalert

Imdalert

దక్షిణాది రాష్ట్రాలకు భారత వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. కర్ణాటకలో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. అలాగే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా తెలంగాణ, ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తుందని తెలిపింది. రానున్న 24 గంటల్లో కోస్తా, రాయలసీమలో వర్ష ప్రభావం ఉంటుందని చెప్పింది. అలాగే బీహార్‌లో కూడా వర్షం కురవనుంది.

ఇది కూడా చదవండి: Trump Tariff: చైనాపై 145 శాతం సుంకాలు.. భారత్‌కు జులై 9 వరకు మినహాయింపు

ఇక బెంగళూరులో ప్రస్తుతం వర్షపు జల్లులతో నగరం ముద్దవుతోంది. ఈరోజు, రేపు నగరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వార్నింగ్ ఇచ్చింది. ఏప్రిల్ 13 వరకు తేలికపాటి జల్లులు పడే ఛాన్సుందని చెప్పింది. ఉష్ణోగ్రత 21 డిగ్రీలకు పడిపోవచ్చని చెప్పింది. ప్రస్తుతం నగరంలో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.

కర్ణాటకలో తుమకూరు, హాసన్, కొడగు, మైసూర్, చామరాజనగర్, దక్షిణ కన్నడ, ఉడిపి, చిక్కమగళూరు, చిత్రదుర్గ, దావణగెరె, హవేరి, ఉత్తర కన్నడ తదితర జిల్లాలతో సహా పలు కర్ణాటక జిల్లాలకు 2 రోజుల పాటు ‘ఎల్లో అలర్ట్’ జారీ చేసింది. ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

ఇది కూడా చదవండి: Vontimitta Kalyanam 2025: ఒంటిమిట్టలో సీతారాముల కల్యాణోత్సవం.. కడప మీదుగా వెళ్లే వాహనాలు దారి మళ్లింపు!

Exit mobile version