లడఖ్ రాష్ట్ర సాధన కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ప్రస్తుతం రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జైల్లో ఉంచారు. లడఖ్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలంటూ ఇటీవల పెద్ద ఎత్తున లడఖ్‌లో హింస చెలరేగింది. బీజేపీ కార్యాలయం సహా అనేక ప్రభుత్వ కార్యాలయాలను అల్లరిమూకలు తగలబెట్టారు. సోనమ్ వాంగ్‌చుక్ రెచ్చగొట్టే ప్రసంగాల కారణంగానే ఈ హింస చెలరేగినట్లుగా కేంద్రం భావించింది. దీంతో సోనమ్ వాంగ్‌చుక్‌ను జాతీయ భద్రతా చట్టం (NSA) కింద అరెస్టు చేసి రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జైలుకు తరలించారు. అయితే జైలు నుంచే నిరాహార దీక్ష కొనసాగిస్తానని సోనమ్ హెచ్చరించారు.
ఇది కూడా చదవండి: Trump: ట్రంప్-మెలానియా మధ్య వాగ్వాదం.. వీడియో వైరల్
ఇక వాంగ్‌చుక్ అరెస్ట్‌ను జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఖండించారు. ఈ అరెస్ట్ ‘‘దురదృష్టకరం’’ అని అభివర్ణించారు. తాను హింసను సమర్థించడం లేదని.. కానీ అలాంటి పరిస్థితి రావడానికి ఎందుకు అనుమతించారో బీజేపీ సమాధానం చెప్పాలని కోరారు. బీజేపీ వారి వాగ్దానాలను ఎప్పటికీ నెరవేర్చదని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: PM Modi: బీఎస్ఎన్ఎల్ 4జీ టవర్లను ప్రారంభించిన మోడీ
ఇక వాంగ్‌చుక్‌ను లడఖ్‌లో కాకుండా జోధ్‌పూర్ జైలుకు తరలించడానికి అల్లర్లు మరింత పెరగకుండా ఉండేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ జైలు అత్యంత భద్రత కలిగిన జైలు. ఈ జైలు ప్రసిద్ధి చెందిన జైలు. బ్రిటిష్ కాలంలో నిర్మించిన జైలు. ప్రస్తుతం వాంగ్‌చుక్‌ను ఏకాంత గదిలో ఉంచారు. నిరంతరం సీసీకెమెరాలతో పర్యవేక్షించనున్నారు.
ఈ జైల్లో 1998లో కృష్ణ జింకల వేట కేసులో దోషిగా తేలిన బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్, అత్యాచార నిందితుడు ఆశారాం బాపూ వంటి ప్రముఖులు ఈ జైల్లోనే ఉన్నారు. ఇండియన్ ముజాహిదీన్, జమ్మూకాశ్మీర్ వేర్పాటువాద నాయకుడు అబ్దుల్ ఘనీ లోన్‌లకు చెందిన చాలా మంది ఉగ్రవాదులను కూడా ఈ జైల్లోనే ఉంచారు. 1965లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో ఈ జైలుపై కూడా దాడి జరిగింది. ఈ దాడిలో జైలులోని 30 మందికి పైగా మరణించారు. ప్రస్తుతం ఈ జైల్లో 1,400 మంది ఖైదీలు ఉన్నారు. అయితే వాంగ్‌చుక్‌ను ఈ జైల్లో ఎందుకు ఉంచారో కారణం చెప్పకపోయినా.. ఆయన మద్దతుదారులు భారీ నిరసనలు చేయకుండా ఉండేందుకు ముందు జాగ్రత్తగా అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అందుకోసమే శుక్రవారం వాంగ్‌చుక్‌ను అరెస్ట్ చేయగానే ప్రత్యేక హెలికాప్టర్‌లో రాజస్థాన్‌కు తరలించారు.