Abhijeet Dipke: సోనమ్‌వాంగ్‌చుక్ దీక్ష భగ్నం వేళ అభిజీత్ దీప్కే సంచలన నిర్ణయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Abhijeet Dipke: ఢిల్లీలోని జంతర్ మంతర్ మరోసారి ఆందోళనల కేంద్రంగా మారింది. ఇరవై రోజులుగా నిరాహార దీక్ష చేస్తున్న పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్ ఆరోగ్యం క్షీణించడంతో ఆయనను ఆస్పత్రికి తరలించిన ఘటన ఉద్యమానికి కొత్త మలుపు తీసుకొచ్చింది. ఈ పరిణామంతో నిరసన ముగుస్తుందనుకున్న సమయంలో కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. వాంగ్చుక్ను నిరసన స్థలం నుంచి తొలగించడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ తాను కూడా నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. దీంతో జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
జంతర్ మంతర్ వద్ద మీడియాతో మాట్లాడిన అభిజీత్ దిప్కే, ఉద్యమాన్ని ఏ పరిస్థితుల్లోనూ ఆపబోమని స్పష్టం చేశారు. జూలై 20న నిర్వహించనున్న మార్చ్ యథావిధిగా కొనసాగుతుందని ప్రకటించారు. నిరసనను అణచివేయాలని చేసిన ప్రయత్నం పెద్ద తప్పిదమని ఆయన ఆరోపించారు. ఈ ఉద్యమానికి మద్దతుగా ఎక్కువ మంది ప్రజలు జంతర్ మంతర్‌కు రావాలని పిలుపునిస్తూ, తమ పోరాటం మరింత విస్తృత స్థాయికి చేరుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. తాను ఈ రోజు నుంచే నిరవధిక నిరాహార దీక్ష ప్రారంభిస్తున్నానని వెల్లడించారు.
Also Read
- Delhi: ఇండియా కూటమి ర్యాలీ ఎఫెక్ట్.. మూతపడ్డ 2.5 లక్షల దుకాణాలు, 80 శాతం వ్యాపారం బంద్.!
- Rahul Gandhi: ‘‘ర్యాలీకి రండి.. షాపింగ్ కూడా చేయండి’’.. రాహుల్ గాంధీ పిలుపు..
- CJP: మద్దతు ఇస్తాం, కానీ పాల్గొనబోం.. ప్రతిపక్షాల ర్యాలీపై అభిజిత్ దీప్కే..
- UP Elections: 350 స్థానాలు.. యూపీలో బీజేపీ టార్గెట్ ఫిక్స్..
ఇక సోనమ్ వాంగ్‌చుక్ గత ఇరవై రోజులుగా ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరాహార దీక్ష కొనసాగిస్తున్నారు. అయితే ఆయన ఆరోగ్యం క్షీణించిందని వైద్యులు సూచించడంతో శనివారం ఉదయం ఢిల్లీ పోలీసులు ఆయనను సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనను అత్యవసర విభాగంలో చేర్చినట్లు సమాచారం. ఆయన స్పృహలోనే ఉన్నారని, ప్రాణాధార సూచికలు స్థిరంగా ఉన్నాయని వైద్య వర్గాలు వెల్లడించాయి.
ఈ వ్యవహారంపై ఢిల్లీ పోలీసులు కూడా అధికారికంగా స్పందించారు. నిపుణులైన వైద్యుల సలహా మేరకు, అలాగే ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా వాంగ్చుక్ను అత్యవసర వైద్యం కోసం ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. ఇది కేవలం వైద్య అవసరాల దృష్ట్యానే తీసుకున్న నిర్ణయమని పేర్కొన్నారు.
వాంగ్‌చుక్ ఆస్పత్రిలో చేరిన వెంటనే జంతర్ మంతర్ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీ సంఖ్యలో ఢిల్లీ పోలీసు సిబ్బందిని అక్కడ మోహరించారు. అలాగే అక్కడ కొనసాగుతున్న నిరసనకారులు శాంతియుతంగా నిరసన స్థలాన్ని వీలైనంత త్వరగా ఖాళీ చేయాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. అయితే అభిజీత్ దిప్కే ప్రకటనతో నిరసన మరింత ఉధృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. జూలై 20న ప్రతిపాదించిన మార్చ్ ఎలా సాగుతుంది, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, ఈ ఉద్యమానికి ప్రజల నుంచి ఎంత మేర మద్దతు లభిస్తుంది అన్నది ఇప్పుడు రాజకీయంగా, సామాజికంగా ఆసక్తికర అంశంగా మారింది.
#WATCH | Delhi: Founding President of the Cockroach Janta Party, Abhijeet Dipke, says, “I am commencing my indefinite hunger strike starting today. I appeal to everyone: do not back down; this movement will only grow larger. They have made a grave mistake… I urge everyone to… pic.twitter.com/iCoB6jSOHQ
— ANI (@ANI) July 18, 2026
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Live Updates: మున్సిపల్ ఎన్నికల పోలింగ్ లైవ్ అప్డేట్స్.. నగరిలో అత్యధిక పోలింగ్!
-
Israel PM: ఇజ్రాయెల్ ప్రధానిగా ఐసెన్‌కోట్..? కీలక నిర్ణయం దిశగా అరబ్ పార్టీలు..
-
Delhi: ఇండియా కూటమి ర్యాలీ ఎఫెక్ట్.. మూతపడ్డ 2.5 లక్షల దుకాణాలు, 80 శాతం వ్యాపారం బంద్.!
-
Trump Warning: ఇరాన్‌పై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు.. కేవలం 10 నిమిషాల్లో అణు స్థావరాలు ధ్వంసం..
-
Toyota Innova Hycross Facelift: 360 డిగ్రీ కెమెరా, Wi-Fi, డ్యాష్‌క్యామ్‌తో ఇన్నోవా హైక్రాస్.. భారత్‌లో లాంచ్ ఎప్పుడంటే?
-
Germany: జర్మనీలో జెన్-జీ అల్లర్లు.. ఫ్రాంక్‌ఫర్ట్‌లో లూటీలు, పెట్రోల్ బాంబులు!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!