Sonali Bendre: చిక్కుల్లో బాలీవుడ్ నటి సోనాలి బెంద్రే ఫ్యామిలీ.. సివిల్ కోర్టులో రైతు తీవ్ర ఆరోపణలు
- చిక్కుల్లో బాలీవుడ్ నటి సోనాలి బెంద్రే ఫ్యామిలీ
- సివిల్ కోర్టులో రైతు తీవ్ర ఆరోపణలు
- ఆరోపణలు ఖండించిన బాలీవుడ్ నటి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ నటి సోనాలి బెంద్రే ఫ్యామిలీ చిక్కుల్లో చిక్కుకుంది. తమ భూమిని సోనాలి బెంద్రే, ఆమె భర్త గోల్డీ బెహల్ అక్రమంగా ఆక్రమించుకున్నారని రైతు చంద్రకాంత్ షిండే సివిల్ కోర్టులో పిటిషన్ వేశాడు. అంతేకాకుండా చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని పోలీసులకు కూడా ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది.
ఏం జరిగిందంటే..
పుణె జిల్లా మావల్ ప్రాంతానికి చెందిన రైతు చంద్రకాంత్ షిండే తమ కుటుంబానికి 1957 నుంచి వారసత్వంగా వస్తున్న సుమారు 30 గుంటల భూమిని సోనాలి బెంద్రే, ఆమె భర్త గోల్డీ బేహల్ అక్రమంగా కొనుగోలు చేశారని అన్నదాత ఆరోపించాడు. గోల్డీ బేహల్ అక్రమంగా స్వాధీనం చేసుకోవడమే కాకుండా.. తమ హక్కులను పట్టించుకోలేదని బాధిత రైతు వాపోయాడు. తనకు న్యాయం చేయాలంటూ చంద్రకాంత్ షిండే వడగావ్ మావల్ సివిల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. సుమారు 32,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న భూమిలో అక్రమంగా నిర్మాణం కూడా చేస్తున్నారని ఆరోపించాడు. భూమి ఆక్రమించుకోవడమే కాకుండా తమ కుటుంబాన్ని బెదిరిస్తున్నారని పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిపాడు.
Also Read
- BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
- Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
- Maharashtra Tragedy: బీచ్ ట్రిప్‌లో విషాదం.. నీటిలో మునిగి 8 మంది స్టూడెంట్స్ మృతి..
- CJP Protest: ‘‘3 రోజులు కాదు.. 3 నెలలు జైల్లో పెట్టినా పోరాటం ఆగదు’’.. సీజేపీ హెచ్చరిక!
సోనాలి బెంద్రే వివరణ
అయితే రైతు చేసిన ఆరోపణలను సోనాలి బెంద్రే, ఆమె న్యాయవాదులు తీవ్రంగా ఖండించారు. భూమి కొనుగోలు పత్రాల్లో తన పేరు ఎక్కడా లేదని తెలిపారు. ఆరోపణలన్నీ పూర్తిగా అబద్ధమని, డబ్బులు కోసమే ఇదంతా దుర్దేశంతో ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు. నటి తరఫు న్యాయవాది రాజు షిండే మాట్లాడుతూ.. ఇదే అంశంపై రైతు గతంలో తహసీల్దార్, సబ్ డివిజనల్ ఆఫీసర్ దగ్గర పలుమార్లు ఫిర్యాదులు చేశారని, అవన్నీ కొట్టివేశాయని గుర్తుచేశారు. కేసును విచారించిన న్యాయస్థానం.. సోనాలి బెంద్రే, గోల్డీ బేహల్‌తో పాటు మరికొందరిని ప్రతివాదులుగా చేర్చింది. తదుపరి విచారణను ఏప్రిల్ 20కి వాయిదా వేసింది.
తాజావార్తలు
-
Flydubai Attack: ఫ్లైదుబాయ్ ఫ్లైట్ దాడి వెనుక ఇరాన్ హస్తం..? ట్రంప్ సంచలన వ్యాఖ్యలు..
-
Christa Pike Execution Fails: మరణశిక్షకు ముందు చివరి నిమిషంలో ఊహించని ట్విస్ట్.. రెండు ఇంజెక్షన్లు ఇచ్చినా..
-
AP Liquor Shops: మద్యం దుకాణాల దరఖాస్తుల గడువు పెంపు.. ఫీజులు, తేదీలు ఇవే
-
BKU : ఓటిటిలో స్ట్రీమింగ్ అవుతున్న ఇండస్ట్రీ హిట్ సినిమా ‘బెత్లహేమ్ కుటుంబ యూనిట్’
-
BrahMos Missile Export: డిఫెన్స్ రంగంలో భారత్ సత్తా.. బ్రహ్మోస్ ఎగుమతులతో గ్లోబల్ మార్కెట్లో దూకుడు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?