Site icon NTV Telugu

Operation Sindoor: పాక్ డ్రోన్‌లను అడ్డుకునే సమయంలో, శకలాలు ఢీకొని సైనికుడి మరణం..

Pak Drone

Pak Drone

Operation Sindoor: పాకిస్తాన్ డ్రోన్ దాడి కారణంగా ఒక సైనికుడు అమరుడయ్యారు. డ్రోన్‌ని అడ్డగించిన సమయంలో దాని శకలాల్లో ఒకటి బలంగా తాకడంతో జవాన్ మరణించినట్లు అధికారులు తెలిపారు. శనివారం, జమ్మూ కాశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలోని వైమానిక స్థావరంలో ఆర్మీ ఎయిర్ డిఫెన్స్ డ్రోన్‌ని విజయవంతంగా అడ్డగించింది. అయితే, డ్రోన్ శిథిలాలు సురేంద్ర సింగ్ మోగ అనే సైనికుడిని బలంగా ఢీకొట్టాయి. దీంతో తీవ్రగాయాలైన అతను మరణించాడు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో సురేంద్ర సింగ్ విధుల్లో ఉన్నారు.

Read Also: IND vs ENG: రోహిత్ శర్మ స్థానంలో భారీ హిట్టర్.. ఐపీఎల్‌లో పరుగుల వరద పారిస్తున్నాడు!

రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ సైనికుడికి ఘన నివాళి అర్పించారు. అతడి కుటుంబానికి సానుభూతి తెలియజేశారు. ‘‘సురేంద్ర సింగ్ మోగా రాజస్థాన్ బిడ్డ, ఝుంఝును నివాసి. భారత సైన్యంలోని సైనికుడు సురేంద్ర సింగ్ మోగా, దేశ భద్రతా కర్తవ్యాలను నిర్వర్తిస్తూ ఉదంపూర్ వైమానిక స్థావరంలో అమరుడయ్యరనే వార్త చాలా విచారకరం’’ అని ఆయన ఎక్స్‌లో రాశారు.

ఆపరేషన్ సిందూర్ తర్వాత నుంచి పాకిస్తాన్ డ్రోన్లు, క్షిపణులతో ఎల్ఓసీ, అంతర్జాతీయ సరిహద్దు వద్ద దాడులకు పాల్పడుతోంది. అయితే, భారత గగనతర రక్షణ వ్యవస్థ వీటిని సమర్థంతంగా అడ్డుకుని గాల్లోనే కూల్చేశాయి. ఉద్రిక్తతలు పెరిగిన నేపథ్యంలో, రెండు దేశాలు కూడా శనివారం కాల్పులు స్టాప్ చేయడానికి అంగీకరించాయి.

Exit mobile version