Site icon NTV Telugu

Social Media Ban: 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలి: సోనూసూద్

Sonu

Sonu

Social Media Ban: పిల్లలపై సోషల్ మీడియా చూపుతున్న ప్రతికూల ప్రభావాల నేపథ్యంలో.. భారతదేశంలో కూడా 16 ఏళ్లలోపు వారికి ఆన్‌లైన్ మీడియాపై నిషేధం అవసరం ఉందని నటుడు సోనూసూద్ పేర్కొన్నారు. ఇప్పటికే ఆస్ట్రేలియా వంటి అభివృద్ధి చెందిన దేశాలు ఈ నిషేధాన్ని అమలు చేస్తున్నాయని, ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇదే దిశగా ఆలోచించాల్సిన సమయం వచ్చిందని సూచించారు.

Read Also: Starlink India: భారత్‌లో త్వరలోనే ‘స్టార్‌లింక్’ సేవలు.. ఎదురుచూస్తున్నా అంటూ ఎలాన్‌ మస్క్‌ ట్వీట్!

ఇక, సోనూసూద్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా పెట్టిన పోస్టులో.. పిల్లలు నిజమైన బాల్యాన్ని ఆస్వాదించేలా, కుటుంబ బంధాలు బలపడేలా, సోషల్ మీడియా వ్యసనం దూరమయ్యేలా చర్యలు తీసుకోవడం అత్యంత కీలకమని చెప్పుకొచ్చారు. మానసిక ఆరోగ్యం, చదువు, సామాజిక వ్యవహారం, వ్యక్తిత్వ వికాసం లాంటి అంశాల్లో డిజిటల్ మీడియా తీవ్రమైన ప్రభావం చూపుతోందని ఆందోళన వ్యక్తం చేశారు.

Read Also: Pragathi: నన్ను ట్రోల్ చేసిన వారికి.. పతకాలతో సమాధానం ఇచ్చాను !

అయితే, భారత ప్రభుత్వం దేశ భవిష్యత్తు కోసం అద్భుతమైన చర్యలు తీసుకుంటోంది అని నటుడు సోనూసూద్ ఆశాభావం వ్యక్తం చేశాడు. పిల్లల భవిష్యత్తును కాపాడటంతో పాటు రేపటి మెరుగైన భారతదేశం కోసం ఈ రోజే మన పిల్లలను రక్షించాలి అని కోరాడు. ఇక, ప్రస్తుతం ప్రపంచంలోని పలు దేశాలు మైనర్‌కు సోషల్ మీడియా అందుబాటులో లేకుండా నియంత్రిస్తున్నాయి. భారత్‌లో కూడా ఈ చర్యలు తీసుకోవాలని సోనూసూద్ చేసిన వ్యాఖ్యలు కొత్త చర్చకు దారి తీస్తున్నాయి.

Exit mobile version