Ketan Agarwal murder: ‘‘కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ’’.. కేతన్ హత్యలో సియా సంచలన ఒప్పుకోలు..
- పెళ్లి వద్దని కుటుంబానికి చెప్పడం కన్నా చంపడమే ఈజీ..
- పోలీస్ విచారణలో సంచలన విషయం చెప్పిన సియా గోయల్..
- కేతన్ అగర్వాల్ హత్య కేసులో వేగం పెంచిన పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ketan Agarwal murder: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కేతన్ అగర్వాల్ హత్య కేసులో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటోంది. నిందితురాలు సియా విచారణలో సంచలన విషయం చెప్పినట్లు తెలుస్తోంది. ‘‘పెళ్లి వద్దని కుటుంబానికి చెప్పడం కన్నా తనకు కాబోయే భర్తను హత్య చేయడమే సులభం అనిపించింది’’ అని పోలీసులతో సియా చెప్పినట్లు తెలుస్తోంది. జూన్ 18న పూణేకు సమీపంలో ఉన్న లోహ్‌గఢ్ కోటకు కేతన్‌ను తీసుకెళ్లిన సియా, తన లవర్ చేతన్ చౌదరితో కలిసి లోయలోకి తోసి హత్య చేసింది. ఈ కేసులో ఇద్దరు నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు.
ఈ కేసు దర్యాప్తు కోసం పూణే, లోనావాలా పోలీసులతో కలిసి మొత్తం 6 ప్రత్యేక టీమ్‌లు విచారణ చేస్తున్నాయి. సియా, చేతన్ల జీవితాలకు సంబంధించిన అన్ని విషయాలను విచారణ అధికారులు రాబడుతున్నారు. సియా తల్లిదండ్రులు, సోదరుడు సహిల్ గోయల్‌ను కూడా పోలీసులు పలుమార్లు విచారించారు. తన సోదరి సియాకు, చేతన్‌కు గతేడాది దీపావళి వేడుకల్లో కామన్ ఫ్రెండ్ ద్వారా పరిచయమైనట్లు సహిల్ పోలీసులకు తెలిపారు.
Also Read
దర్యాప్తులో ఈ ఏడాది జనవరి నుంచి కేతన్‌ను చంపే వారకు సియా-చేతన్ మధ్య 2000లకు పైగా ఫోన్ కాల్స్ వెళ్లాయి. ఇద్దరూ 238 గంటల పాటు మాట్లాడుకున్నారు. హత్యకు ముందు, తర్వాత ఇద్దరు తమ మొబైళ్ల నుంచి చాట్ హిస్టరీ డిలీట్ చేశారు. ఇప్పుడు వీరిద్దరి మొబైల్ ఫోన్లను ఫోరెన్సిక్‌కు పంపించారు. ఇదిలా ఉంటే, సియాకు చేతన్ కేవలం ఒక స్నేహితుడనే తెలుసని సియా తల్లిదండ్రులు చెబుతున్నారు. ఈ వివాహాన్ని కుదిర్చిన మధ్యవర్తుల్ని కూడా పోలీసులు విచారిస్తున్నారు.
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు