Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
- కేతన్ అగర్వాల్ హత్య కేసులో బ్లాక్మెయిల్ కోణంపై దర్యాప్తు.
- ప్రియుడు చేతన్ బెదిరింపులతోనే సియా హత్య చేసిందా అనే అనుమానం.
- డబ్బు లావాదేవీలు, బ్యాంకు ఖాతాలను పోలీసులు పరిశీలిస్తున్నారు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ketan Agarwal Case: పూణేలో కేతన్ అగర్వాల్ హత్య కేసు దేశవ్యాపంగా సంచలనంగా మారింది. కాబోయే భార్య సియా గోయల్, ఆమె లవర్ చేతన్ చౌదరిలు కలిసి ప్లాన్ చేసి, లోయలోకి తోసి చంపారు. ఈ కేసులో రోజుకో ట్విస్ట్ బయటకు వస్తోంది. నిందితురాలు సియా, తన ప్రియుడు చేతన్ ఒత్తిడి, బ్లాక్మెయిల్ కారణంగా ఈ హత్యకు పాల్పడిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సియా-చేతన్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, పర్సనల్ మెసేజ్‌లు బయటపెడుతానని బెదిరించి, హత్యకు కుట్ర పన్నాడా అనే దిశగా పోలీసులు పరిశీలిస్తున్నారు. దీంతో పాటు అంతకుముందు జరిగిన హత్యాయత్నం కేసులో సియా పాత్రను బయటపెడుతానని బెదిరించి, కుట్ర కొనసాగించాడా అనే కోణంలో కూడా డిజిటల్ ఆధారాలను విశ్లేషిస్తున్నారు.
ఇదే కాకుండా, మొదట సియాతో పారిపోదామనుకున్న చేతన్, ఆ తర్వాత గోయల్, అగర్వాల్ కుటుంబాల ఆర్థిక సంపద, సామాజిక పలుకుబడిని దృష్టిలో పెట్టుకుని కేతన్‌ను పూర్తిగా అడ్డుతొలగించాలని నిర్ణయించుకున్నాడా అనే అంశంలో కూడా విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో ఆర్థిక లావాదేవీలను కూడా పోలీసులు పరిశీలిస్తున్నారు. సియా బ్యాంక్ అకౌంట్స్ నుంచి చేతన్‌కు బారీ మొత్తంలో డబ్బు బదిలీ చేశారా అని పరిశోధిస్తున్నారు. నిఘా కోసం చేతన్‌కు సియా భారీ మొత్తంలో డబ్బులు పంపిందా.? తొలి హత్యాయత్నం తెలిసిన చేతన్ డబ్బు కోసం సియాను బ్లాక్మెయిల్ చేశాడా?, పెళ్లి అడ్డంకి తొలిగిన తర్వాత కుటుంబ ఆస్తుల నుంచి నెలవారీగా డబ్బు లేదా ఒకే మొత్తంలో ఇస్తానని సియా ఒప్పుకుందా? అనే కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నారు.
Also Read
- Woman Constable: ఇదేం పద్దతి మేడం.. ఫిర్యాదు కోసం వచ్చిన వృద్ధుడి ఎదుట.. టేబుల్‌పై కాళ్లు పెట్టిన మహిళా కానిస్టేబుల్
- Ayodhya: అయోధ్య రామాలయ విరాళాల కుంభకోణంలో కీలక పరిణామం.. ట్రస్ట్ కీలక సభ్యులు రాజీనామా..
- CM Yogi: "ఎవ్వరినీ వదిలి పెట్టను".. అయోధ్య విరాళాల దుర్వినియోగంపై సీఎం యోగి ఆగ్రహం..
- Ketan Murder Case: కేతన్ హత్య కేసులో కొత్త ట్విస్ట్.. ఇద్దరు తల్లుల మధ్య మాటల యుద్ధం!
జూన్ 18న జరిగిన హత్యకు ముందు సియా నగదు విత్ డ్రా చేసిందా అనే విషయాన్ని ఫోరెన్సిక్ టీమ్స్ విశ్లేషిస్తున్నాయి. దీనికి ముందు జూన్ 14న లోహ్‌గఢ్ కోటలో చేతన్‌ను సియా తోసి చంపే ప్లాన్ విఫలమైంది. ఇదిలా ఉంటే, హత్యకు ఒక రోజు ముందు పూణేలోని కేఫేలో ఇద్దరు గంట పాటు చర్చించుకోవడం అక్కడి సీసీటీవీ కెమెరాల్లో రికార్డ్ అయింది. అక్కడే మర్డర్ కోసం ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే, నేరానికి అసలు సూత్రధారి ఎదుటివారేనని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నట్లు సమాచారం.
తాజావార్తలు
-
Ketan Agarwal Case: కేతన్-సియా కేసులో కొత్త ట్విస్ట్.. బ్లాక్మెయిల్ కోణంలో దర్యాప్తు..
-
IAS Krishna Teja: పంచాయతీ నిధుల గోల్మాల్.. వైరల్‌గా మారిన కమిషనర్ కృష్ణతేజ వార్నింగ్..
-
Sanjay Jaju : తెలంగాణ నూతన సీఎస్ గా సంజయ్ జాజు నియామకం
-
Varanasi Update: ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. ఈ సెప్టెంబర్ నాటికే..!
-
Shah Rukh Khan: ‘నా భర్త కంటే మీరే ఇష్టం’.. మహిళా అభిమాని మాటకు షారుఖ్ ఇచ్చిన సమాధానం వైరల్
ట్రెండింగ్
-
Home Freshness Tips: ఇంట్లో దుర్వాసనకు చెక్.. ఎయిర్ ఫ్రెషనర్లు లేకుండానే సింపుల్ చిట్కాలతో ఇంటిని ఫ్రెష్‌గా ఉంచండి.!
-
Vaibhav Sooryavanshi Records: ఐర్లాండ్‌తో డెబ్యూ.. వైభవ్ ముందున్న 5 రికార్డులు ఇవే.!
-
Viral Video: పోలీస్ స్టేషన్లో సహోద్యోగిని ముద్దుపెట్టుకున్న మహిళా కానిస్టేబుల్.. చివరకు.?
-
రూ.9,999కే Lava Smart 4 Plus లాంచ్.. 6.75 అంగుళాల డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు.!
-
Pesara Garelu Recipe: బయట క్రిస్పీగా, లోపల సాఫ్ట్‌గా ఉండే రుచికరమైన స్నాక్ “పెసర గారెలు” చేసేయండి ఇలా.!