Site icon NTV Telugu

Himachal Pradesh: భారీ ఈదురుగాలులు.. ఆరుగురు మృతి

Himachalpradesh

Himachalpradesh

హిమాచల్‌ప్రదేశ్‌లో ఆకస్మాత్తుగా ఏర్పడిన వాతావరణ మార్పులతో ఒక్కసారిగా భీకరమైన ఈదురుగాలులు ఏర్పడ్డాయి. దీంతో భారీ వృక్షాలు నేలకూలిపోయియి. అంతేకాకుండా కొండల మీద నుంచి పెద్ద పెద్ద బండరాయలు దొర్లుకుంటూ వచ్చి కార్లపై పడ్డాయి. దీంతో అనేక వాహనాలు దెబ్బతిన్నాయి. మణికరణ్ గురుద్వారా ముందు రోడ్డు పక్కన ఉన్న భారీ వృక్షం కూలి ఆరుగురు చనిపోయారు. కొండచరియలు కూడా విరిగిపడ్డాయ. అప్రమత్తమైన అధికారులు సహాయ చర్యలు చేపట్టారు.

ఇది కూడా చదవండి: Uttam Kumar Reddy: 84 శాతం మంది లబ్ధిదారులకు సన్న బియ్యం..

ఆదివారం బలమైన గాలులకు చెట్లు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు. హిమాచల్ ప్రదేశ్‌లోని కులులోని మణికరణ్ గురుద్వారా పార్కింగ్ సమీపంలో వాహనాలు, కిరణా దుకాణాలపై పడిపోవడంతో కనీసం ఆరుగురు మరణించారని అధికారులు తెలిపారు. ఇక ఈ సంఘటనలో ఐదుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని జారిలోని స్థానిక కమ్యూనిటీ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదిలా ఉంటే ఈ వారం ప్రారంభంలో ఉరుములు, మెరుపులతో కూడిన తుఫానులు, ఈదురుగాలులు వీస్తాయని ముందుగానే వాతావరణ శాఖ పసుపు హెచ్చరిక జారీ చేసింది. ఈదురుగాలులు గంటకు 40-50 కి.మీ వేగంతో ఉంటాయని తెలిపింది.

ఇది కూడా చదవండి: Earthquake: టోంగా దీవుల్లో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

Exit mobile version