Sitharaman’s ‘rupee not sliding but dollar strengthening’ remark: ఇటీవల కాలంలో రూపాయి విలువ ఎప్పుడూ లేని విధంగా పడిపోతోంది. డాలర్ తో పోలిస్తే రూపాయి విలువ పడిపోతోంది. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆమె విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. రూపాయి పడిపోవడం లేదని.. డాలర్ బలపడుతోందని ఆమె అన్నారు. ఇది అన్ని దేశాల కరెన్సీపై ప్రభావం చూపిస్తుందని ఆమె అన్నారు. అనేక ఇతర అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థతో పోలిస్తే భారతదేశం, కరెన్సీ చాలా మెరుగ్గా ఉందని ఆమె అన్నారు.
ఆర్బీఐ రూపాయి విలువను స్థిరీకరించడానికి ప్రయత్నిస్తోందని ఆమె అన్నారు. గత సోమవారం అమెరికా డాలర్ తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఆల్ టైం కనిష్టస్థాయికి 82.68కి పడిపోయింది. జీ-20 భారత అధ్యక్ష పదవి తీసుకోవడంపై ఆమె మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా చాలా సవాళ్లు ఉన్న సమయంలో భారత్ ఈ బాధ్యతలు తీసుకుంటుందని ఆమె అన్నారు. క్రిప్టో కరెన్సీకి సంబంధించి విషయాలను జీ-20లో చర్చించాలని అనుకుంటున్నట్లు ఆమె వెల్లడించారు.
Read Also: Bihar: బీహార్‌లో పడవ బోల్తా.. ఏడుగురు మృతి
ఇటీవల ఐఎంఎఫ్ నుంచి భారత్ అభినందనలు అందుకున్న విషయంపై ఆమె స్పందించారు. భారతదేశం ఆధార్, డిజిటల్ విజయాలను గురించి మాట్లాడారు. ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడితో మాట్లాడుతున్న సందర్భంలో కూడా ఇండియాలో డిజిటల్ లావాదేవీలపై మాట్లాడినట్లు వెల్లడించారు. భారత్ తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉందని ఆయన తెలిపినట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. దేశంలో జరుగుతున్న ఈడీ దాడులపై కూడా నిర్మలా సీతారామన్ స్పందించారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పూర్తిగా స్వతంత్య్రంగా పనిచేసే సంస్థ అని అన్నారు. రాజకీయ ప్రతీకార ప్రయోజనాల కోసం ప్రభుత్వం ఈడీని వినియోగిస్తుందనే ఆరోపణలను తోసిపుచ్చారు.