NTV Telugu Site icon

Nirmala Sitharaman: 2034 తర్వాతే “జమిలి ఎన్నికలు”.. నిర్మలా సీతారామన్ క్లారిటీ..

Nirmala Sitharaman

Nirmala Sitharaman

Nirmala Sitharaman: జమిలి ఎన్నికలపై వస్తున్న పుకార్లపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ క్లారిటీ ఇచ్చారు. ‘‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’’పై వస్తున్న తప్పుడు కథనాలను శనివారం ఆమె తోసిపుచ్చారు. రాబోయే ఎన్నికల్లో దీన్ని అమలు చేయబోమని స్పష్టం చేశారు. చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో దాదాపుగా లక్ష కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, ఏక కాల ఎన్నికల ద్వారా ఇంత భారీ ఖర్చును ఆదా చేయవచ్చని ఆమె చెప్పారు.

Read Also: Janhvi Kapoor : జాన్వీకపూర్ అందాల జాతర.. ఈ ఫోజులు చూశారా..

పార్లమెంట్, అసెంబ్లీ సభ్యలను ఎన్నుకోవడానికి ఒకే సారి ఎన్నికలు నిర్వహిస్తే, దేశ జీడీపీ దాదాపు 1.5 శాతం వృద్ధి చెందుతుందని, విలువ పరంగా ఆర్థిక వ్యవస్థకు రూ. 4.50 లక్షల కోట్లు జోడించవచ్చని చెప్పారు. ‘‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’’పై కొన్ని పార్టీలు తప్పుడు కథనాలను వ్యాప్తి చేస్తున్నాయని, గుడ్డిగా వ్యతిరేకిస్తున్నారని ఆమె మండిపడ్డారు. 2023 తర్వాత మాత్రమే జమిలి ఎన్నికలు జరిగే అవకాశం ఉంటుందని ఆమె స్పష్టం చేశారు.

‘‘ ఒకే దేశం ఒకే ఎన్నికలు’’ అనే భావన ప్రధాని నరేంద్రమోడీ ప్రవేశపెట్టింది కాదని, ఇది 1960 నుంచి ఉనికిలో ఉందని నిర్మలా సీతారామన్ అన్నారు. దానిని గుడ్డిగా వ్యతిరేకించే బదులు, దాని ప్రయోజనాలను పరిగణలోకి తీసుకుని మద్దతు ఇస్తే దేశాన్ని ముందుకు తీసుకెళ్లేలా చేస్తుందని అన్నారు. దివంగత డీఎంకే పితామహుడు ఎం కరుణానిధి ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ భావనకు మద్దతు ఇచ్చారని, కానీ ఆయన కుమారుడు, ప్రస్తుత ముఖ్యమంత్రి (ఎం కె స్టాలిన్) తన తండ్రి అడుగుజాడల్లో నడవడం లేదని, బదులుగా దానిని వ్యతిరేకిస్తున్నారని ఎన్ సీతారామన్ ఆరోపించారు. జమిలి ఎన్నికలు అనే భావన దేశ సంక్షేమాన్ని పరిగణలోకి తీసుకుని రూపొందించినట్లు ఆమె చెప్పారు.