Gurpatwant Singh Pannun: పాక్‌పై యుద్ధంలో సిక్కులు పాల్గొనవద్దు.. ఖలిస్తాన్ ఉగ్రవాది పిలుపు..
- పాకిస్తాన్‌పై యుద్ధంలో సిక్కులు పాల్గొనవద్దు..
- ఖలిస్తాన్ ఏర్పాటు తర్వాత పాక్ మన పొరుగు దేశం..
- ఖలిస్తానీ ఉగ్రవాది పన్నూన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Gurpatwant Singh Pannun: పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇలాంటి సమయంలో, ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌తో భారత్ యుద్ధం చేస్తే సిక్కులు ఈ యుద్ధంలో పాల్గొనవద్దని పిలుపునిచ్చాడు. ‘‘భారత్ పాకిస్తాన్‌పై దాడి చేస్తే, అది భారత్ మరియు మోడీకి చివరి యుద్ధం అవుతోంది. పంజాబీలు పాకిస్తాన్‌కి మద్దతుగా నిలుస్తారు. పంజాబ్ పాకిస్తాన్‌కి వెన్నెముక అవుతుంది’’ అంటూ ఒక వీడియో సందేశంలో పిలుపునిచ్చినట్లు పాక్ మీడియా నివేదించింది.
Read Also: Off The Record: తుంగతుర్తి కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయిందా..?
Also Read
భారత్ పంజాబ్‌లో సైనిక కంటోన్మెంట్ ప్రాంతాల్లోని గోడలపై సిక్కులు ఈ యుద్ధంలో పాల్గొనవద్దని రాస్తున్నట్లు ఆయన అబద్ధాలను ప్రచారం చేయడం ప్రారంభించాడు. పన్నూ వ్యాఖ్యలకు ముందు, పాక్ సెనెటర్ పాల్వాషా మొహమ్మద్ జై ఖాన్ మాట్లాడుతూ.. భారత సైన్యంలోని ఏ సిక్కు సైనికుడు కూడా పాకిస్తాన్‌పై దాడి చేయడని అన్నారు. పాక్ గురునానక్ భూమి అని సిక్కులు తమపై దాడి చేయరని అన్నారు.
పాకిస్తాన్ శత్రువు కాదని, స్నేహపూర్వక దేశమని పన్నూ చెబుతూ, పంజాబ్ విముక్తం అయిన తర్వాత తమ పొరుగు దేశంగా పాకిస్తాన్ ఉంటుందని చెప్పాడు. ‘‘ నరేంద్రమోడీ యుద్ధానికి నో చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. పాకిస్తాన్‌తో పోరాడకండి. పాకిస్తాన్ మీ శత్రువు కాదు. పాకిస్తాన్ సిక్కు ప్రజలకు, ఖలిస్తాన్‌కు స్నేహపూర్వక దేశంగా ఉంటుంది. పంజాబ్‌ను మనం విముక్తి చేసిన తర్వాత, పాకిస్తాన్ మన పొరుగు దేశం అవుతుంది’’ అని అన్నాడు.
తాజావార్తలు
-
Jailer 2: రజనీకాంత్ ‘జైలర్ 2’కు టాలీవుడ్ సినిమాల సెగ.. రిలీజ్ డేట్ మారుతుందా?
-
Hockey World Cup 2026 విజేతగా జర్మనీ.. స్పెయిన్‌పై 1-0తో విజయం.!
-
ICC Decision: శ్రీలంకకు ఐసీసీ షాక్.. మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ 2027 ఆతిథ్య హక్కులు రద్దు, కారణం ఇదే
-
Sai Abhyankkar : హీరో కావాలన్న కోరికను ఇండి ఆల్బమ్స్‌తో తీర్చుకుంటున్నాడా..?
-
Vem Narender Reddy: మార్చి 2027 వరకు లక్ష ఉద్యోగాల భర్తీ.. వారానికి ఒక నోటిఫికేషన్.!
ట్రెండింగ్
-
క్రిస్టల్స్‌తో మెరిసిపోనున్న Motorola కొత్త ఫోల్డబుల్ ఫోన్.. IFA 2026లో సరికొత్త స్వరోవ్స్కీ ఎడిషన్.!
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!