Site icon NTV Telugu

Gurpatwant Singh Pannun: పాక్‌పై యుద్ధంలో సిక్కులు పాల్గొనవద్దు.. ఖలిస్తాన్ ఉగ్రవాది పిలుపు..

Pannun

Pannun

Gurpatwant Singh Pannun: పహల్గామ్ దాడి నేపథ్యంలో భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇలాంటి సమయంలో, ఖలిస్తాన్ ఉగ్రవాది, సిక్ ఫర్ జస్టిస్(ఎస్ఎఫ్‌జే) చీఫ్ గురుపత్వంత్ సింగ్ పన్నూన్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్‌తో భారత్ యుద్ధం చేస్తే సిక్కులు ఈ యుద్ధంలో పాల్గొనవద్దని పిలుపునిచ్చాడు. ‘‘భారత్ పాకిస్తాన్‌పై దాడి చేస్తే, అది భారత్ మరియు మోడీకి చివరి యుద్ధం అవుతోంది. పంజాబీలు పాకిస్తాన్‌కి మద్దతుగా నిలుస్తారు. పంజాబ్ పాకిస్తాన్‌కి వెన్నెముక అవుతుంది’’ అంటూ ఒక వీడియో సందేశంలో పిలుపునిచ్చినట్లు పాక్ మీడియా నివేదించింది.

Read Also: Off The Record: తుంగతుర్తి కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలిపోయిందా..?

భారత్ పంజాబ్‌లో సైనిక కంటోన్మెంట్ ప్రాంతాల్లోని గోడలపై సిక్కులు ఈ యుద్ధంలో పాల్గొనవద్దని రాస్తున్నట్లు ఆయన అబద్ధాలను ప్రచారం చేయడం ప్రారంభించాడు. పన్నూ వ్యాఖ్యలకు ముందు, పాక్ సెనెటర్ పాల్వాషా మొహమ్మద్ జై ఖాన్ మాట్లాడుతూ.. భారత సైన్యంలోని ఏ సిక్కు సైనికుడు కూడా పాకిస్తాన్‌పై దాడి చేయడని అన్నారు. పాక్ గురునానక్ భూమి అని సిక్కులు తమపై దాడి చేయరని అన్నారు.

పాకిస్తాన్ శత్రువు కాదని, స్నేహపూర్వక దేశమని పన్నూ చెబుతూ, పంజాబ్ విముక్తం అయిన తర్వాత తమ పొరుగు దేశంగా పాకిస్తాన్ ఉంటుందని చెప్పాడు. ‘‘ నరేంద్రమోడీ యుద్ధానికి నో చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది. పాకిస్తాన్‌తో పోరాడకండి. పాకిస్తాన్ మీ శత్రువు కాదు. పాకిస్తాన్ సిక్కు ప్రజలకు, ఖలిస్తాన్‌కు స్నేహపూర్వక దేశంగా ఉంటుంది. పంజాబ్‌ను మనం విముక్తి చేసిన తర్వాత, పాకిస్తాన్ మన పొరుగు దేశం అవుతుంది’’ అని అన్నాడు.

Exit mobile version