NTV Telugu Site icon

Punjab: పంజాబ్‌లో పరిస్థితి ఆందోళనకరమట.. కెనడా, యూకే ఎంపీల మొసలి కన్నీరు..

Amritpal Singh

Amritpal Singh

Punjab: పంజాబ్ పోలీసులు, కేంద్రబలగాలు ఖలిస్తానీ వేర్పాటువాది, ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ అమృత్ పాల్ సింగ్ కోసం జల్లెడ పడుతున్నాయి. గత రెండు రోజులుగా అతడి కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇప్పటికే ఆయన మద్దతుదారులు 78 మందిని లోపలేశారు. ఇదిలా ఉంటే కొంతమంది కెనడా, యూకే సిక్కు ఎంపీలు మాత్రం పంజాబ్ పరిస్థితిపై మొసలి కన్నీరు కారుస్తున్నారు. పంజాబ్ లో ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.

కెనడా ఎంపీ జస్‌రాజ్ సింగ్ హలన్.. భారతదేశంలోని పంజాబ్ నుంచి వస్తున్న నివేదికల గురించి చాలా ఆందోళన చెందుతున్నామని, ప్రభుత్వం ఇంటర్నెట్ సేవలను నిలిపేసింది, కొన్ని ప్రాంతాల్లో నలుగురి కన్నా ఎక్కువ వ్యక్తులు సమావేశాలు కావద్దని ఆంక్షలు విధించింది, పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నామని ఆదివారం ట్వీట్ చేశారు. కెనడాకు చెందిన మరో ఎంపీ రణదీప్ ఎస్ సరాయ్ కూడా ఇదే విధంగా అభిప్రాయాన్ని తెలియజేశారు.

Read Also: Illegal Affair: పెళ్లాం ప్రెగ్నెంట్.. ఆమె నా గర్ల్ ఫ్రెండ్.. తెగించిన కానిస్టేబుల్

పంజాబ్ పరిస్థితులను పర్యవేక్షిస్తున్నామని, ఇంటర్నెట్ బ్లాక్ అవుట్ కారణంగా యూకేలో ఉన్న కుటుంబీకులు పంజాబ్ లో ఉన్న తమవారి కోసం ఆందోళన చెందుతున్నారని యూకే సిక్కు ఎంపీ ప్రీత్ కౌర్ గిల్ అన్నారు. పంజాబ్ రాష్ట్రంలో ఇంటర్నెట్ బ్లాక్ అవుట్ విధించడం, సామూహిక అరెస్టులకు పాల్పడుతున్నారని, భారత్ నుంచి ఆందోళనకర నివేదికలు అందుతున్నాయని, ఉద్రిక్త పరిస్థితులు తగ్గాలని, మానవహక్కులను గౌరవించాలని చెబుతూ.. యూకే ఎంపీ తన్‌మన్‌జీత్ సింగ్ ధేసీ ట్వీట్ చేశారు.

అయితే ధేసీ ప్రకటనపై కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వీ ఆగ్రహం వ్యక్తం చేశారు. యూకేలో ఖలిస్తానీ భావాలను పెంపొందిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్తాన్ జనాభా మద్దతు ఎక్కువగా ఉండే స్లాఫ్ నియోజకవర్గంలో కొత్త ఓట్లను ఈ ప్రకటనల ద్వారా సంపాదించుకోలేరు అని ట్వీట్ చేశారు.