Siddaramaiah: “హిజాబ్”కు అనుమతి, “కాషాయ కండువాల”కు నో పర్మిషన్..
- కర్ణాటకలో మళ్లీ మొదలైన ‘‘హిజాబ్’’ వివాదం..
- పాఠశాల్లలో హిజాబ్‌కు అనుమతి, కాషాయ కండువాలకు అభ్యంతరం..
- హిజాబ్ ఆర్డర్‌పై సీఎం సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Siddaramaiah: కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం పాఠశాల విద్యార్థులు హిజాబ్, పవిత్ర దారాలు, తలపాగా ఇతర మతపరమైన చిహ్నాలను ధరించడానికి అనుమతి ఇచ్చింది. అయితే, పాఠశాలల్లో కాషాయ కండువాలకు అనుమతి లేదని సీఎం సిద్ధరామయ్య చెప్పారు. ఇప్పుడు ఈ ప్రకటన కర్ణాటకలో కాంగ్రెస్, బీజేపీల మధ్య కొత్త వివాదానికి కారణమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
మైసూరులో విలేకరులతో మాట్లాడుతూ.. ఇప్పటికే ఆచరణలో ఉన్న మతపరమైన వస్త్రధారణ అనుమతి కొనసాగుతుందని, కొత్త వాటిని అనుమతించేది లేదని చెప్పారు. “కాషాయ శాలువలకు అనుమతి లేదు. ఆ శాలువలను ధరించకూడదు. తలపాగాలు, పవిత్ర దారం, శివధార, రుద్రాక్షలు మరియు హిజాబ్‌లను ఎవరి నమ్మకాలకు అనుగుణంగా వారు ధరించవచ్చు. 12వ తరగతి వరకు వీటికి అనుమతి ఉంది” అని బుధవారం చెప్పారు. పాఠశాలల్లో కాషాయ కండువాలకు అనుమతి ఉంటుందా? అని విలేకరి ప్రశ్నకు ఇలా సమాధానం ఇచ్చారు.
Also Read
ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. దీనిని బుజ్జగింపు రాజకీయాలుగా అభివర్ణించింది. సిద్ధరామయ్య హిందూ వ్యతిరేకి అని, ఆయన హిజాబ్‌కు అభ్యంతరం చెప్పడం లేదు కానీ, కాషాయ కండువాలకు అభ్యంతరం చెబుతున్నారని, ఇది బుజ్జగింపు రాజకీయం అని బీజేపీ అధికార ప్రతినిధి అశోక్ గౌడ అన్నారు. 2022లో అప్పటి బీజేపీ ప్రభుత్వం పాఠశాలల్లో హిజాబ్‌ను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఉత్తర్వుల్ని రద్దు చేసింది.
తాజావార్తలు
-
Siddaramaiah: “హిజాబ్”కు అనుమతి, “కాషాయ కండువాల”కు నో పర్మిషన్..
-
Keralam: గవర్నర్‌ను కలిసిన సతీశన్.. 18న సీఎంగా ప్రమాణస్వీకారం
-
TG Intermediate: తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యలో కీలక మార్పులు.. ఇక ఫస్ట్ ఇయర్లో ప్రాక్టికల్స్..
-
Boycott Peddi: మెగా పవర్ స్టార్‌కు సింగిల్ స్క్రీన్ల షాక్.. ‘పెద్ది’ని బహిష్కరించిన తెలంగాణ ఎగ్జిబిటర్లు!
-
Kejriwal: కేజ్రీవాల్, సిసోడియాకు ఢిల్లీ హైకోర్టు షాక్.. ధిక్కార కేసు నమోదు చేయాలని ఆదేశం
ట్రెండింగ్
-
Wedding Tragedy : కన్నీళ్లు తెప్పిస్తున్న ఘటన.. కూతురు బారాత్ వెళ్లాల్సిన దారిలో.. తండ్రి అంతిమయాత్ర..!
-
AI ఫీచర్లతో రియల్మీ కొత్త గ్యాడ్జెట్లు.. కొత్త Realme Buds Air8 Pro, Watch S5 లాంచ్.!
-
WhatsAppలో ‘Incognito AI Chat’.. యూజర్లకు మెటా బిగ్ అప్డేట్.!
-
8000mAh భారీ బ్యాటరీ, 200MP కెమెరా, Snapdragon 8 Elite Gen 5తో తో Xiaomi 17 Max పవర్ఫుల్ ఎంట్రీ.!
-
8K కెమెరా, 165Hz డిస్ప్లే, Snapdragon 8 Gen 5తో Motorola Razr Fold లాంచ్.. ధరే కాస్త ఎక్కువ..!