NTV Telugu Site icon

Asaduddin Owsisi: శ్రద్ధా వాకర్ హత్య “లవ్ జీహాద్” కాదు..

Asaduddin Owaisi

Asaduddin Owaisi

Shraddha murder case is not about ‘love jihad’says asaduddin Owaisi: దేశవ్యాప్తంగా ఢిల్లీ శ్రద్ధా వాకర్ హత్య కేసు సంచలనం సృష్టించింది. లివ్ రిలేషన్ షిప్ లో ఉన్న శ్రద్ధాను ఆమె లవర్ అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా హత్య చేశారు. అయితే ఈ హత్యపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే బీజేపీ నాయకులు కొంతమంది ఈ హత్యను ‘ లవ్ జీహాద్’గా పేర్కొంటున్నారు. దీనిపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు.

Read Also: Bandari Shanti Kumar : మల్లారెడ్డి తప్పించుకోలేరు.. శిక్ష అనుభవించక తప్పదు

శ్రద్ధా హత్యను మతపరమైన కోణంలో చూడొద్దని ఆయన అన్నారు. బీజేపీ పార్టీ శ్రద్ధా హత్యను ‘మతపరమైన కోణం’లో చూస్తోందని ఆయన విమర్శించారు. ఇది లవ్ జీహాద్ కానది ఓవైసీ అన్నారు. బీజేపీ దీన్ని రాజకీయంగా వాడుకుంటుందని విమర్శించారు. ఇది లవ్ జీహాద్ సమస్య కాదని ఒక మహిళపై దోపిడీ, వేధింపుల సమస్య అని దీన్ని అందరూ ఖండిచాలని ఓవైసీ అన్నారు. అజంగడ్ లో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి సూట్‌కేస్‌లో గుర్తు చేస్తూ.. ఇలాంటి ఘటనలు బాధాకరమని.. వాటిని రాజకీయం చేయొద్దని, హిందూ-ముస్లిం కోణంలో చూడద్దని సూచించారు. గుజరాత్ ఎన్నికల్లో 13 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఎన్నికల పోరాటంలో తమకు ఏ పార్టీ మద్దతు అవసరం లేదని మేము దేశప్రజలను, రాజ్యాంగాన్ని నమ్ముతామని ఆయన అన్నారు.

అంతకుముందు శ్రద్ధా హత్యను ‘ లవ్ జీహాద్ ’గా అభివర్ణించారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. యూనిఫాం సివిల్ కోడ్, లవ్ జీహాద్ కు వ్యతిరేకంగా చట్టాలు అవసరమని ఆయన అన్నారు. దేశానికి అఫ్తాబ్ వంటి వ్యక్తి అవసరం లేదని.. రాముడు, ప్రధాని నరేంద్ర మోదీ వంటి నాయకులు అవసరం అని ఆయన అన్నారు. అఫ్తాబ్-శ్రద్ధా వంటి కేసు ఒక్కటే కానది.. ప్రతీ ప్రాంతంలో ఇవి జరుగుతున్నాయని.. వీటిని ఆపాలంటే లవ్ జీహాద్ కు వ్యతిరేకంగా చట్టం అవసరం అని.. ఇది బీజేపీతోనే సాధ్యం అని హిమంత బిశ్వ శర్మ అన్నారు.