Asaduddin Owsisi: శ్రద్ధా వాకర్ హత్య “లవ్ జీహాద్” కాదు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shraddha murder case is not about ‘love jihad’says asaduddin Owaisi: దేశవ్యాప్తంగా ఢిల్లీ శ్రద్ధా వాకర్ హత్య కేసు సంచలనం సృష్టించింది. లివ్ రిలేషన్ షిప్ లో ఉన్న శ్రద్ధాను ఆమె లవర్ అఫ్తాబ్ పూనావాలా అత్యంత దారుణంగా హత్య చేశారు. అయితే ఈ హత్యపై ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉంటే బీజేపీ నాయకులు కొంతమంది ఈ హత్యను ‘ లవ్ జీహాద్’గా పేర్కొంటున్నారు. దీనిపై ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు.
Read Also: Bandari Shanti Kumar : మల్లారెడ్డి తప్పించుకోలేరు.. శిక్ష అనుభవించక తప్పదు
Also Read
శ్రద్ధా హత్యను మతపరమైన కోణంలో చూడొద్దని ఆయన అన్నారు. బీజేపీ పార్టీ శ్రద్ధా హత్యను ‘మతపరమైన కోణం’లో చూస్తోందని ఆయన విమర్శించారు. ఇది లవ్ జీహాద్ కానది ఓవైసీ అన్నారు. బీజేపీ దీన్ని రాజకీయంగా వాడుకుంటుందని విమర్శించారు. ఇది లవ్ జీహాద్ సమస్య కాదని ఒక మహిళపై దోపిడీ, వేధింపుల సమస్య అని దీన్ని అందరూ ఖండిచాలని ఓవైసీ అన్నారు. అజంగడ్ లో ఓ వ్యక్తి తన భార్యను హత్య చేసి సూట్‌కేస్‌లో గుర్తు చేస్తూ.. ఇలాంటి ఘటనలు బాధాకరమని.. వాటిని రాజకీయం చేయొద్దని, హిందూ-ముస్లిం కోణంలో చూడద్దని సూచించారు. గుజరాత్ ఎన్నికల్లో 13 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఎన్నికల పోరాటంలో తమకు ఏ పార్టీ మద్దతు అవసరం లేదని మేము దేశప్రజలను, రాజ్యాంగాన్ని నమ్ముతామని ఆయన అన్నారు.
అంతకుముందు శ్రద్ధా హత్యను ‘ లవ్ జీహాద్ ’గా అభివర్ణించారు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ. యూనిఫాం సివిల్ కోడ్, లవ్ జీహాద్ కు వ్యతిరేకంగా చట్టాలు అవసరమని ఆయన అన్నారు. దేశానికి అఫ్తాబ్ వంటి వ్యక్తి అవసరం లేదని.. రాముడు, ప్రధాని నరేంద్ర మోదీ వంటి నాయకులు అవసరం అని ఆయన అన్నారు. అఫ్తాబ్-శ్రద్ధా వంటి కేసు ఒక్కటే కానది.. ప్రతీ ప్రాంతంలో ఇవి జరుగుతున్నాయని.. వీటిని ఆపాలంటే లవ్ జీహాద్ కు వ్యతిరేకంగా చట్టం అవసరం అని.. ఇది బీజేపీతోనే సాధ్యం అని హిమంత బిశ్వ శర్మ అన్నారు.
తాజావార్తలు
-
Medico Priyanka: మెడికో ప్రియాంక పరిస్థితి విషమం.. మద్యం మత్తులో కారుతో తొక్కించిన ఉన్మాదులు..
-
Monsoon: హిందూ మహాసముద్రంలో భారీ మేఘం.. భారీ వర్షాలు కురిసే అవకాశం
-
Box Office : సెప్టెంబర్‌లో సినిమా జాతర.. గెలిచేది ఎవరు.?
-
NTR: ‘మీ స్ట్రోక్ చాలా అమేచ్యూరిష్‌గా ఉంది..’ డైలాగ్ ఏ సినిమాలోదో తెలుసా?
-
RBI New Rules: NBFCలపై ఆర్బీఐ షాక్.. క్రెడిట్ కార్డులు, ఫ్లెక్సీ లోన్లకు కఠిన ఆంక్షలు
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!