Site icon NTV Telugu

Eknath Shinde: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీకి సహకరించాలని కార్యకర్తలకు శివసేన పిలుపు

Eknathshinde

Eknathshinde

దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. అన్ని పార్టీలు జోరుగా ప్రచారం సాగిస్తున్నాయి. ఆప్-బీజేపీ మధ్య నువ్వానేనా? అన్నట్టుగా ఫైటింగ్ సాగుతోంది. ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ మేనిఫెస్టో ప్రకటించింది. అలాగే బీజేపీ కూడా మూడు భాగాలుగా మేనిఫెస్టో ప్రకటిస్తోంది. ఇప్పటికే రెండు మేనిఫెస్టోలు వెల్లడించింది. మహిళలు, విద్యార్థులు, యువత లక్ష్యంగా వరాలు కురిపించింది.

ఇదిలా ఉంటే తాజాగా బీజేపీకి ఏక్‌నాథ్ షిండే మద్దతు ప్రకటించారు. ఢిల్లీలో బీజేపీకి సపోర్టు చేయాలని కార్యకర్తలకు శివసేన అధినేత ఏక్‌నాథ్ షిండే పిలుపునిచ్చారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన మంగళవారం ప్రకటించింది. బీజేపీ రాష్ట్ర యూనిట్‌తో పొత్తు పెట్టుకుని ప్రచారంలో చురుకుగా పాల్గొనాలని పార్టీ ఢిల్లీ యూనిట్‌ను ఆదేశించినట్లు షిండే తెలిపారు.

ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఫిబ్రవరి 5న ఎన్నికలు జరుగుతుండగా.. ఫిబ్రవరి 8న ఎన్నికల ఫలితాలు విడుదల కానున్నాయి. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోటీ నెలకొంది.

ఇది కూడా చదవండి: Game Changer : ఆ ఒక్క విషయంలో మాత్రం గేమ్ ఛేంజర్ ఫెయిల్ కాలేదు

 

Exit mobile version