BMW Crash: మహారాష్ట్రలో కారు ప్రమాదం పొలిటికల్ టర్న్ తీసుకుంది. ముంబైలోని వర్లీలో ఈ రోజు ఉదయం వేగంగా వెళ్తున్న బీఎండబ్ల్యూ కారు ఢీకొని ఒక మహిళ మరణించింది. ఏక్‌నాథ్ షిండే శివసేన నాయకుడి కుమారుడు ఈ కారును నడుపుతున్నట్లు తేలింది. దీంతో ఒక్కసారిగా ఈ ఘటన చర్చనీయాంశంగా మారింది. 24 మిహిర్ షా ఏళ్ల వ్యక్తి నిర్లక్ష్యంగా కారు నడపడంతో ప్రమాదం జరిగనట్లు బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఘటన జరిగిన సమయంలో మిహిర్ షా మద్యం మత్తులో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు.
మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాకు చెందిన శివసేన నేత రాజేష్ షా కుమారుడు మిషిర్ షా ఈ కేసులో నిందితుడు. ప్రస్తుతం రాజేష్ షా, అతని డ్రైవర్ రాజేంద్ర సింగ్ బిజావత్ ఇప్పుడు పోలీసుల అదుపులో ఉన్నారు. కొత్త క్రిమినల్ కోడ్ భారతీయ న్యాయ సంహిత ప్రకారం నేరపూరిత హత్య, ర్యాష్ డ్రైవింగ్, సాక్ష్యాలు నాశనం చేయడం వంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రమాదానికి కారణమైన కారు మిహిర్ షా పేరుతో రిజిస్టర్ అయింది. ప్రమాదం జరిగిన సమయంలో అతను కారులోనే ఉన్నాడని పోలీసులు తెలిపారు.
Read Also: Sai Dharam Tej: నటుడిపై తీవ్రస్థాయిలో ఫైర్ అయిన సాయి ధరంతేజ్.. స్పందించిన డిప్యూటీ సీఎం
పోలీసులు సేకరించిన వివరాల ప్రకారం.. మిహిర్ గత రాత్రి జుహూలోని ఓ బార్‌లో మద్యం సేవించినట్లు తెలిసింది. ఇంటికి వెళ్తున్న క్రమంలో డ్రైవర్‌ని లాంగ్ డ్రైవ్ చేయాలని కోరాడని, కారు వర్లీ వచ్చిన తర్వాత కారుని తాను డ్రైవింగ్ చేస్తానని మిహిర్ పట్టుబట్టాడు. స్టీరింగ్ తీసుకున్న తర్వాత, వెంటనే కారు స్కూటర్‌ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటర్‌పై వర్లీలోని కోలివాడ ప్రాంతానికి చెందిన కావేరి నక్వా, ఆమె భర్త ప్రదీప్ నక్తా ఉన్నారు. చేపలు అమ్మే వారి సస్సూన్ డాక్‌కి చేపలు తీసుకురావడానికి వెళ్లారు. వారు తిరిగి వస్తుండగా ప్రమాదం జిరగింది. కారు కావేరి నక్వా మీద నుంచి దూసుకెళ్లింది. మహిళను ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స చేస్తున్న క్రమంలో ఆమె మరణించింది. ఆమె భర్త ప్రదీప్‌కి స్వల్పగాయాలయ్యాయి.
మిహిర్ ప్రమాదం గురించి తన తండ్రికి ఫోన్ చేసి చెప్పాడు. ఆ తర్వాత నుంచి ఫోన్ స్విచ్చాఫ్‌లో ఉందని పోలీసులు వెల్లడించారు. అతడిని పట్టుకునేందుకు నాలుగు టీంలు ప్రయత్నిస్తున్నాయి. పోలీసుల విచారణలో సాక్ష్యాలు ధ్వంసం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తేలింది. కారు విండ్ షీల్డ్‌పై శివసేన స్టిక్కర్ ఉంది. దీనిని తీసేందుకు ప్రయత్నించడంతో పాటు కారు నంబర్ ప్లేట్ తొలగించారు. ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతటివారినైనా చట్టం కఠినంగా శిక్షస్తుందని చెప్పారు. గత నెలలో పూణేలో ఇలాగే మద్యం తాగిన మైనర్ యువకుడు24 ఏళ్ల ఇద్దరు యువ ఇంజనీర్ల మరణానికి కారణమయ్యాడు. ఈ కేసు కూడా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.