హస్తం పార్టీకి శశిథరూర్ తలనొప్పిగా మారారు. కాంగ్రెస్‌లో ఉంటూ ప్రత్యర్థి పార్టీ బీజేపీని ప్రశంసిస్తున్నారు. ఇక పాకిస్థాన్ వైఖరిని అంతర్జాతీయ వేదికపై వినిపించేందుకు ఏర్పాటు చేసిన ఏడు బృందాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్‌కు బాధ్యతలు అప్పగించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌తో సంబంధాలు బీటలు వారుతున్నట్లు తెలుస్తోంది. ఇక కేంద్రం కూడా శశిథరూర్‌కు కీలక బాధ్యతలు అప్పగించడం కాంగ్రెస్‌కు మింగుడుపడటం లేదు. తాము పేరు ప్రతిపాదించకుండా ఎలా తీసుకుంటారని ఆగ్రహంగా ఉంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఆయనపై వేటు వేయాలా? వద్దా అన్న అంశంపై హస్తం నేతలు తర్జనభర్జన పడుతున్నారు.
ఇది కూడా చదవండి: Bihar: రీల్స్ చేస్తుందని కోడలిపై మామ దారుణం.. చివరకు ఏమైందంటే?
దౌత్య బృందంలోకి పేర్లు తెలియజేయాలని కేంద్రం కాంగ్రెస్‌ను కోరింది. కానీ ఇంతలోనే పార్టీతో సంబంధం లేకుండా కేంద్రమే నేరుగా శశిథరూర్ పేరును ప్రకటించింది. దీంతో కాంగ్రెస్ నేతలు గుర్రుగా ఉన్నారు. ఇదొక్కటే కాదు.. ఇటీవల కేరళ పర్యటనలో మోడీతో శశిథరూర్ కలిసి తిరిగారు. కేంద్రమంత్రి పీయూస్ గోయల్‌తో సెల్పీ దిగారు. ఇలా కేంద్ర పెద్దలతోనే ఎక్కువగా సంబంధాలు కలిగి ఉన్నారు. కాంగ్రెస్‌లో ఉంటూ.. బీజేపీ పెద్దలతో కలిసి తిరగడం హస్తం నేతలకు మింగుడుపడడం లేదు. ఇదిలా ఉంటే 2026లో కేరళలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికలకు ముందే ఏదొక నిర్ణయం తీసుకుంటే బాగుంటుందని నేతలు భావిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవడానికి సాహించలేకపోతున్నారు.
ఇది కూడా చదవండి: Jyoti Malhotra: జ్యోతి యూట్యూబ్ ఛానల్‌లో పహల్గామ్ వీడియోలు.. డానిష్‌తో ఎన్‌క్రిప్టెడ్ సంబంధాలు!
కాంగ్రెస్ నేత శశి థరూర్ నేతృత్వంలోని బృందం.. అమెరికా, పనామా, గయానా, కొలంబియా, బ్రెజిల్‌కు వెళ్లనుంది. పాక్ తీరును ఆయా దేశాల నేతలకు వివరించనున్నారు. పహల్గామ్ ఉగ్ర దాడి.. ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ఉగ్రవాదులు చనిపోతే.. పాకిస్థాన్ ప్రభుత్వ పెద్దలు హాజరు కావడం వంటి విషయాలు వివరించనున్నారు.
