Site icon NTV Telugu

Sharad Pawar: ఆయన కేంద్ర హోంమంత్రి కావడం మన దురదృష్టం

Sharad

Sharad

Sharad Pawar: కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాపై నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్‌ షా నాపై ఎన్నో ఆరోపణలు చేశారు.. దేశంలోని అవినీతిపరులందరికీ నేనొక ముఠా నాయకుడినంటూ అబద్దాలు చెప్పారు.. కానీ, చట్టాన్ని దుర్వినియోగం చేశారంటూ ఓ కేసు విషయంలో సుప్రీంకోర్టు ఆయనను రెండేళ్ల పాటు గుజరాత్‌ రాష్ట్రం నుంచి బహిష్కరించింది అని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి నేడు మన దేశానికి కేంద్ర హోంమంత్రిగా కొనసాగడం నిజంగా విచిత్రంగా ఉందని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం, మన దేశం ఎలాంటి వారి చేతిలో ఉందో మనమంతా ఆలోచించుకోవాలి అని సూచించారు. ఇలాంటి వారు దేశాన్ని అవినీతి మార్గంలోనే నడిపిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. దీనిపై దృష్టి సారించాల్సిన అవసరముందిని శరద్‌ పవార్‌ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.

Read Also: Union Minister Murugan: ఢిల్లీలో జగన్‌ ధర్నాపై కేంద్రమంత్రి సంచనల వ్యాఖ్యలు..

కాగా, 2010లో సోహ్రాబుద్ధీన్‌ షేక్‌ ఎన్‌కౌంటర్‌ కేసులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాను సుప్రీంకోర్టు గుజరాత్‌ నుంచి రెండేళ్ల పాటు బహిష్కరణ చేసింది. ఆ తర్వాత 2014లో ఆయన నిర్దోషిగా రిలీజ్ అయ్యారు. తనపై షా చేసిన వ్యాఖ్యలకు స్పందించిన పవార్‌.. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు మహారాష్ట్రలోని రాజకీయ పక్షాలు రెడీ అవుతున్నాయి. ఈసారి కూడా అధికారం తమదేనని ఎన్డీఎ కూటమి వెల్లడించింది. ఎలాగైనా ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకునేందుకు ఎంవీఏ (మహా వికాస్‌ అఘాడీ) తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది.

Exit mobile version