Sharad Pawar: ఆయన కేంద్ర హోంమంత్రి కావడం మన దురదృష్టం
- కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సీరియస్..
- ఓ క్రిమినల్ దేశ హోంమంత్రి అయ్యాడు: శరద్ పవార్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sharad Pawar: కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అమిత్ షా నాపై ఎన్నో ఆరోపణలు చేశారు.. దేశంలోని అవినీతిపరులందరికీ నేనొక ముఠా నాయకుడినంటూ అబద్దాలు చెప్పారు.. కానీ, చట్టాన్ని దుర్వినియోగం చేశారంటూ ఓ కేసు విషయంలో సుప్రీంకోర్టు ఆయనను రెండేళ్ల పాటు గుజరాత్ రాష్ట్రం నుంచి బహిష్కరించింది అని గుర్తు చేశారు. అలాంటి వ్యక్తి నేడు మన దేశానికి కేంద్ర హోంమంత్రిగా కొనసాగడం నిజంగా విచిత్రంగా ఉందని ఆయన మండిపడ్డారు. ప్రస్తుతం, మన దేశం ఎలాంటి వారి చేతిలో ఉందో మనమంతా ఆలోచించుకోవాలి అని సూచించారు. ఇలాంటి వారు దేశాన్ని అవినీతి మార్గంలోనే నడిపిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. దీనిపై దృష్టి సారించాల్సిన అవసరముందిని శరద్ పవార్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు.
Read Also: Union Minister Murugan: ఢిల్లీలో జగన్ ధర్నాపై కేంద్రమంత్రి సంచనల వ్యాఖ్యలు..
Also Read
- Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
- Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
- AAP: ప్రశ్నించడమే పాపం.. సొంత ఎమ్మెల్యేను బహిష్కరించిన ఆప్..
- CJP Protest: కాక్రోచ్‌లపై ముంబై పోలీసుల యాక్షన్.. నిర్వాహకులతో పాటు 400-500 మందిపై కేసు
కాగా, 2010లో సోహ్రాబుద్ధీన్ షేక్ ఎన్‌కౌంటర్ కేసులో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను సుప్రీంకోర్టు గుజరాత్ నుంచి రెండేళ్ల పాటు బహిష్కరణ చేసింది. ఆ తర్వాత 2014లో ఆయన నిర్దోషిగా రిలీజ్ అయ్యారు. తనపై షా చేసిన వ్యాఖ్యలకు స్పందించిన పవార్.. ఈ విషయాన్ని గుర్తు చేస్తూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు మహారాష్ట్రలోని రాజకీయ పక్షాలు రెడీ అవుతున్నాయి. ఈసారి కూడా అధికారం తమదేనని ఎన్డీఎ కూటమి వెల్లడించింది. ఎలాగైనా ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకునేందుకు ఎంవీఏ (మహా వికాస్ అఘాడీ) తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది.
- Tags
- Amit Shah
- bjp
- Corruption
- Maharashtra
- NCP
తాజావార్తలు
-
Flydubai Attack: ‘‘ప్రార్థన చేస్తూ వెనక నుంచి దాడి’’.. సంచలన విషయాలు చెప్పిన స్మిత్ మచ్చర్
-
India at Asian Games 2026: 21 స్వర్ణాలు.. 27 రజతాలు.. 37 కాంస్యాలు.. ఆసియా క్రీడల్లో భారత్ పూర్తి మెడల్ ట్యాలీ ఇదే
-
Singeetam Srinivasa Rao: టాలీవుడ్లో విషాదం.. ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!