మళ్లీ తెరపైకి థర్డ్ ఫ్రంట్..! మోడీని ఢీకొట్టే నేత కోసం వేట..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రధాని నరేంద్ర మోడీ.. ప్రస్తుతం దేశంలో పాపులారిటీ పరంగా బలమైన నేత..! ఆయన నిర్ణయాలు, వైఫల్యాలపై జనంలో ఆగ్రహం ఉన్నప్పటికీ.. మోడీకి సరి సమానమైన నాయకుడు లేరు. దీంతో ఆయా రాష్ట్రాల్లో బీజేపీకి ప్రత్యామ్నాయంగా ప్రాంతీయ పార్టీలను జనం ఆదరిస్తున్నా.. దేశం వరకు వచ్చే సరికి మోడీకి జై కొడుతున్నారు. 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి ఎదురైన వరుస దెబ్బలతో విపక్షాలు అలర్ట్ అయ్యాయి. ముఖ్యంగా ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్.. ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్‌ను గత రెండు వారాల్లో రెండు సార్లు కలవడం ఆసక్తికరంగా మారింది. ఢిల్లీలో ప్రశాంత్ కిశోర్ మరోసారి పవార్‌ని కలిశారు. దాదాపు గంట పాటు సాగిందీ సమావేశం. అయితే ఈ భేటీలో థర్డ్‌ఫ్రంట్ ఏర్పాటుకు చేయాల్సిన ప్రయత్నాలపై చర్చించినట్లు తెలుస్తోంది. మోడీకి ధీటైన నాయకుడిని ఎంపిక చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అప్పుడే 2024లో బీజేపీని ఢీ కొట్టొచ్చన్న భావనతో ఉన్నట్లు తెలుస్తోంది. శరద్‌పవార్‌తో ప్రశాంత్ కిశోర్ ఈ నెల 12నే సమావేశమయ్యారు. దాదాపు మూడు గంటల పాటు ఈ సమావేశం జరిగింది. థర్డ్ ఫ్రంట్ ఆలోచనకు ఇక్కడే బీజం పడినట్లు తెలుస్తోంది.
పశ్చిమ బెంగాల్, తమిళనాడు ఎన్నికల్లో దీదీ, స్టాలిన్ విజయానికి ప్రశాంత్ కిశోర్ కీలకంగా పని చేశారు. దీంతో మూడో ఫ్రంట్ ప్రయత్నాల్లో పీకే కీలకంగా వ్యవహరిస్తున్నట్లు చెబుతున్నారు. ఇదే కాదు వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక్కడ కూడా బీజేపీ వ్యతిరేకంగా ఉమ్మడి వ్యూహంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించాయి. ఢిల్లీలో పీకేతో భేటీ ముగియగానే.. పవార్ విపక్షాల భేటీకి పిలుపునిచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ నేత యశ్వంత్ సిన్హాకు చెందిన రాష్ట్ర మంచ్ తరపున నేతలందరికీ ఆహ్వానాలు అందాయి. దాదాపు 15 విపక్ష పార్టీలు మంగళవారం సమావేశమవుతాయి. ఈ భేటీకి కాంగ్రెస్‌తో పాటు ఆర్‌జేడీ, ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు పలు పార్టీలకు పిలుపు వచ్చింది. ఈ మధ్య ప్రధాని మోడీ ప్రతిష్ట బాగా పడిపోయిందని భావిస్తోన్న నేతలు.. బీజేపీని ఎదుర్కొనేందుకు సమయం ఆసన్నమైందని భావిస్తున్నారు. జాతీయ స్థాయిలో ప్రతిపక్షాలన్నీ ఏకం కావాల్సిన అవసరం ఉందని ఇప్పటికే శివసేన నేత సంజయ్ రాత్ ప్రకటించారు. వీళ్లే కాదు.. ప్రాంతీయ పార్టీల నేతలందరితోనూ భేటీ అయ్యేందుకు నేతలు సిద్ధమవుతున్నారు. మొత్తంగా ఢిల్లీ స్థాయిలో జరుగుతున్న పరిణామాలు ఆసక్తికరంగా మారాయి.
Also Read
- NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
- Maharashtra: ఘోర విషాదం.. ఆలయ గోడ కూలి ఆరుగురు మృతి
- UP: భర్త కోసం టవరెక్కిన మహిళ.. గంట తర్వాత ఏం జరిగిందంటే..!
- Terrorist Digital Plan: భారత్ టార్గెట్‌గా టెర్రరిస్టుల కొత్త ‘డిజిటల్’ ప్లాన్.. నిఘా వర్గాలకు అంతుచిక్కని మిస్టరీ!
తాజావార్తలు
-
Story Board : ప్రధాని మోడీ స్పీచ్ దారి తప్పిందా ? ఏదో చెప్పాలని..ఇంకేదో చెప్పారా ?
-
NEET Paper Leak: రూ. 10 లక్షలకు కొని, రూ. 15 లక్షలకు అమ్మకం.. నీట్ పేపర్ లీక్ కేసులో నిందితుడి అరెస్ట్..
-
Russia: ప్రపంచానికి షాక్ ఇచ్చిన పుతిన్ ‘అణు’ బాంబ్.. ‘సర్మాట్’ క్షిపణితో సర్ప్రైజ్!
-
KCR : బీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో డిజిటల్ విప్లవం.. ఎర్రవెల్లిలో కేసీఆర్ సుదీర్ఘ మంతనాలు.!
-
Maharashtra: ఘోర విషాదం.. ఆలయ గోడ కూలి ఆరుగురు మృతి
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!