Bombay HC: ‘‘సిగ్గుమాలిన చర్య’’.. అత్తపై అల్లుడి అత్యాచారం.. కోర్టు కీలక తీర్పు..
- పిల్లనిచ్చిన అత్తపై అల్లుడి అత్యాచారం..
- ‘‘సిగ్గుమాలిన చర్య’’ అంటూ హైకోర్టు ఆగ్రహం..
- నిందితుడికి 14 ఏళ్ల శిక్షని సమర్థించిన కోర్టు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bombay HC: తన కూతురినిచ్చి పెళ్లి చేసిన అత్తపైనే అల్లుడు అత్యాచారం చేసిన ఘటనకు సంబంధించిన కేసుని బాంబే హైకోర్టు విచారించింది. విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసింది. ‘‘ఇది సిగ్గుమాలిన చర్య’’ అని, తల్లిలాంటి మహిళలపై ఇలాంటి ఘటనకు పాల్పడిన నిందితుడిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. జీఏ సనప్‌తో కూడిన సింగిల్ బెంచ్ ఈ కేసును విచారిస్తూ.. బాంబే హైకోర్టు నాగ్‌పూర్ బెంచ్ మంగళవారం వ్యక్తికి విధించిన శిక్షను సమర్థించింది.
డిసెంబర్ 2018లో తన 55 ఏళ్ల అత్తగారిపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి సెషన్స్ కోర్టు 14 ఏళ్ల జైలు శిక్షను విధిస్తూ 2022లో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుని దోషి హైకోర్టులో సవాల్ చేశాడు. తన అల్లుడు, కూతురు విడిగా ఉంటున్నారని, ఇద్దరు మనవళ్లు తండ్రి వద్దే ఉంటున్నారని బాధిత మహిళ కోర్టు చెప్పింది.
Also Read
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Mamata Banerjee: మమతా దీదీకి మరో షాక్.. ముస్లిం ఎమ్మెల్యేల తిరుగుబాటు..
- Mohan Bhagwat: ప్రపంచం మన మాట వినాలంటే శక్తి కూడా అవసరం.. మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు
- DMK: లోక్‌సభలో కాంగ్రెస్‌తో కలిసి కూర్చోం.. డీఎంకే నిర్ణయానికి గ్రీన్ సిగ్నల్..!
Read Also: Chandigarh: పంజాబ్ యూనివర్సిటీలో తీవ్ర ఉద్రిక్తత.. విద్యార్థులపై లాఠీఛార్జ్
ఘటన జరిగిన రోజున, నిందితుడు తన అత్త వద్దకు వెళ్లాడు. అక్కడ ఆమెతో గొడవపడ్డాడు. తన భార్యను తనతో కలపాలని ఆమెను సహాయం చేయాలని కోరాడు. నిందితుడి బలవంతం మేరకు బాధితురాలు అతడితో కలిసి అతడి ఇంటికి వెళ్లింది. నిందితుడు తాగి వచ్చి ఆమెపై మూడుసార్లు అత్యాచారం చేశాడు. జరిగిన విషయాన్ని తన కుమార్తె కు చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది.
హైకోర్టును ఆశ్రయించిన వ్యక్తి తన అప్పీల్లో తనను తప్పుడు అత్యాచార కేసులో ఇరికించారని, ఇది ఏకాభిప్రాయం మేరకు జరిగిన లైంగిక సంబంధమని పేర్కొన్నాడు. అయితే, కోర్టు వాదనలను అంగీకరించడానికి నిరాకరించింది. ఈ సంఘటన జరిగిన సమయంలో బాధితురాలి వయసు 55 ఏళ్లు, తప్పుడు ఆరోపణలు చేయడం ద్వారా ఆమె క్యారెక్టర్‌పై ఎలాంటి మచ్చను తీసుకురాదని చెప్పింది.
‘‘ఒక వేళ ఇది ఏకాభిప్రాయ చర్య అయితే, ఆమె పోలీసుల వద్ద ఫిర్యాదు చేసేది కాదు. ఏకాభిప్రాయ చర్య అయితే ఈ విషయాన్ని తన కుమార్తెకు వెల్లడించదు.’’ అని కోర్టు పేర్కొంది. తన అల్లుడు ఇలాంటి నీచమైన పనికి పాల్పడతాడని ఆ మహిళ ఊహించలేదని ధర్మాసనం పేర్కొంది. తన సొంత తల్లి వయసు ఉన్న అత్తగారిపై అవమానకరమైన చర్యకు పాల్పడిన నిందితుడు స్త్రీతత్వాన్ని అపవిత్రం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేసింది.
తాజావార్తలు
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
-
Peddi: బుక్ మై షోలో సరికొత్త రికార్డు.. చరణ్ కెరియర్లోనే బిగ్గెస్ట్ ఓపెనర్‌గా ‘పెద్ది’?
-
Employee Salary Freeze: ఉద్యోగులకు షాక్.. టెక్ కంపెనీ సంచలన నిర్ణయం.. జీతాల కంటే AI ముఖ్యం..!
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్‌ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!