Himanta Biswa Sarma: నిన్న షారుఖ్ తెలియదన్నారు.. ఈరోజు ఫోన్‌లో మాట్లాడారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Shahrukh Khan Called Assam CM Himanta Biswa Sarma On Theatre Incident: శనివారం ఓ మీడియా సమావేశంలో తనకు బాలీవుడ్ కింగ్ షారుఖ్ ఖాన్ ఎవరో తెలియదని అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ పేర్కొన్న సంగతి తెలిసిందే! ఇప్పుడు ఆ షారుఖ్‌తోనే తాను ఫోన్‌లో మాట్లాడానని ఆదివారం తెలిపారు. ఆదివారం ఉదయం 2 గంటలకు తనకు షారుఖ్ ఫోన్ చేసి, గువహటిలో పఠాన్ సినిమాను ప్రదర్శించే థియేటర్‌పై దాడి జరిగిన ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారని అన్నారు. ఈ విషయంలో తాము అండగా ఉంటామని, శాంతి భద్రతలను కాపాడే బాధ్యత ప్రభుత్వందేనని తాను భరోసా ఇచ్చానని ట్విటర్ మాధ్యమంగా వివరించారు. ఆ ఘటనపై తాము విచారణ జరుపుతామని, అలాంటివి పునరావృత్తం కాకుండా చూసుకుంటామని తాను షారుఖ్‌కి హామీ ఇచ్చామని తెలిపారు.
Los Angeles Shooting: లాస్ ఏంజిల్స్ లో కాల్పులు.. పలువురు మృతి
Also Read
- Air India: ఖర్చులు తగ్గించేందుకు కీలక నిర్ణయం.. ఎయిరిండియా కొత్త సీఈవో సూపర్ ప్లాన్!
- Air India Kanishka Bombing: ఎయిర్ ఇండియా కనిష్క పేలుడు.. 41 ఏళ్ల తర్వాత కేసు మూసివేత దిశగా కెనడా?
- CM Vijay: "పుట్టిన బిడ్డకు బంగారు ఉంగరం".. రాష్ట్రంలో కొత్త పథకం..
- West Bengal: మమత మద్దతు.. ఆ వెంటనే కాంగ్రెస్ అభ్యర్థి అరెస్ట్.. నందిగ్రామ్‌లో ట్విస్ట్
కాగా.. శనివారం నిర్వహించి మీడియా సమావేశంలో షారుఖ్ గురించి మీడియా ప్రతినిధులు హిమంతను ప్రశ్నించగా, అసలు తనకు షారుఖ్ ఎవరో తెలియదని బాంబ్ పేల్చారు. బాలీవుడ్ నుంచి తనకు చాలామంది ఫోన్ చేస్తుంటారని, కానీ ఇప్పటిదాకా ఆ ఖాన్ పేరుతో తనకు ఎవరూ ఫోన్ చేయలేదని చెప్పారు. ఒకవేళ అతడు ఫోన్ చేస్తే, తాను తప్పకుండా సమస్యల గురించి ఆలోచిస్తానని తెలిపారు. ఈ విధంగా ఆయన వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటల్లోనే షారుఖ్ ఫోన్ చేయడం గమనార్హం. ఇదిలావుండగా.. ఈనెల 25వ తేదీన భారీ అంచనాల మధ్య విడుదల అవుతున్న పఠాన్ సినిమాపై హిందూ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్న విషయం తెలిసిందే! బేషరమ్ రంగ్ పాటలో దీపికా పదుకొణె కాషాయం రంగు బికినీ ధరించడమే అందుకు కారణం. ఈనేపథ్యంలోనే గువహటిలోని నరెంగిలో పఠాన్ చిత్రాన్ని ప్రదర్శించే థియేటర్‌పై భజరంగ్ దళ్ కార్యకర్తలు దాడి చేశారు. దీనిపై చర్చించేందుకు హిమంతకు షారుఖ్ ఫోన్ చేశారు.
Shraddha Walkar Case: శ్రద్ధా వాకర్ కేసులో 3000 పేజీల ఛార్జిషీట్
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్‌నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..