షారూఖ్ ఖాన్.. బాలీవుడ్ సూపర్‌స్టార్. దేశంలోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. తన నటనతో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. ప్రపంచ ఐకాన్‌గా పేరు గడించారు. ఇంత స్టార్‌డమ్ సంపాదించిన బాలీవుడ్ హీరో చదువులోనూ బాగానే రాణించారు. ఇందుకు సంబంధించిన ఒక మార్కుల షీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీంతో తమ అభిమాన హీరో సాధించిన మార్కులు చూసి మురిసిపోతున్నారు.
1
షారూఖ్ ఖాన్.. సినిమాల్లోనే కాదు.. చదువులోనూ మంచి ప్రతిభ కనబరిచినట్లుగా తెలుస్తోంది. పాఠశాల, కళాశాల చదువులో మంచి మార్కులు సంపాదించినట్లుగా అర్థమవుతోంది. ప్రస్తుతం ఆయనకు సంబంధించిన మార్కుల షీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మ్యాథ్స్, ఫిజిక్స్‌లో 78 మార్కులు సాధించినట్లుగా కనిపించింది. అలాగే మిగతా సబ్జెక్ట్‌ల్లోనూ మంచి మార్కులే వచ్చాయి. ఇంగ్లీష్ పేపర్‌లో 51 మార్కులు సాధించారు.
ఢిల్లీలోని హన్స్‌రాజ్ కాలేజీలో 1985-1988 మధ్య షారూఖ్ ఖాన్ ఆర్థికశాస్త్రం అభ్యసించారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేసిన తర్వాత అనంతరం జామియా మిలియా ఇస్లామియాలో మాస్ కమ్యూనికేషన్ చదివేందుకు వెళ్లారు. ఇక్కడే జీవితం టర్నింగ్ పాయింట్ అయింది. అనూహ్యంగా షారూఖ్ ఖాన్‌కు సినిమా ఆఫర్లు వచ్చాయి. అలా గ్లామర్ ప్రపంచంలోకి అడుగుపెట్టారు. తొలుత టెలివిజన్ పాత్రల ద్వారా ఎంట్రీ ఇచ్చి.. అనంతరం బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. దీంతో ఢిల్లీ నుంచి ముంబైకి మకాం మార్చారు. 1992లో దీవానా సినిమాతో షారుఖ్ ఖాన్ తెరంగేట్రం చేశారు. ప్రస్తుతం అభిషేక్ బచ్చన్, సుహానా ఖాన్‌లతో కలిసి ‘కింగ్’ సినిమాలో నటిస్తున్నారు.
షారూఖ్ ఖాన్ మొదటి నుంచి తెలివైన విద్యార్థిగా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఆయనకు క్రీడాలంటే కూడా చాలా మక్కువ. అయితే మొదటి నుంచి సినిమాలపై ఆసక్తి ఉండడంతో ఆ రంగంలోకే ప్రవేశించి రాణించారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మార్కుల షీట్‌ను మీరు కూడా చూసేయండి.
SRK's College Marksheet #SRK @iamsrk pic.twitter.com/P4aPRQ7ZaV
— Dr. Curious ❇️ (@Dr_Curiosus) November 12, 2025
