లైంగిక వేధింపుల విషయంలో కేరళలోని ఓ కోర్టు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.. సదరు మహిళ రెచ్చగొట్టేలా దుస్తులు వేసుకుంటే.. అప్పుడు భారత శిక్షా స్మృతి సెక్షన్ 354-ఏ కిందకు రాదని.. అంటే లైంగిక వేధింపులు పరిగణించలేమని పేర్కొంది.. ఒక మహిళను లైంగికంగా వేధించాడన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కేసులో రచయిత సివిక్ చంద్రన్‌కు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన కోర్టు.. ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వైరల్‌గా మారిపోయాయి.. కొందరు నెటిజన్లు కోర్టు వ్యాఖ్యలను స్వాగతిస్తూ కామెంట్లు పెడుతుంటే.. మరికొందరు నిరసన వ్యాఖ్యం చేస్తున్నా.. వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారు.. సోషల్ మీడియా ఈ వ్యవహారంపై విరుచుకుపడుతుండగా, బెయిల్ ఆర్డర్ యొక్క చట్టపరమైన పరిధి లోపభూయిష్టంగా ఉందని న్యాయ వర్గాలు భావిస్తున్నాయి..
Read Also: CWC Meeting: నేడు కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం
ఇక, ఈ సందర్భంగా నిందితుడి వయసును ప్రస్తావించింది కోర్టు… ఒకవేళ భౌతికంగా తాకినా, శారీరక పరిమితులు ఉన్న 74 ఏళ్ల వ్యక్తి ఫిర్యాదుదారును ఒడిలో బలవంతంగా కూర్చోబెట్టుకుంటారని అనుకోవడం నమ్మే విధంగా లేదని వ్యాఖ్యానించింది.. ఈ కేసులో నిందితుడు సమర్పించిన ఫొటోలు చూస్తే ఫిర్యాదు చేసిన మహిళ.. రెచ్చగొట్టేవిధంగా ఉన్న దుస్తులను ధరించినట్లు స్పష్టంగా తెలుస్తోంది. అందువల్ల నిందితుడికి సెక్షన్ 354 ఏ వర్తించదు అని కోజికోడ్ జిల్లా సెషన్స్ కోర్టు జడ్జి ఎస్ కృష్ణకుమార్ వ్యాఖ్యానించారు.. ఫిర్యాదు చేయాలంటే మహిళ గౌరవ, మర్యాదలకు భంగం కలిగిందనేందుకు తగిన ఆధారాలు ఉండాలని పేర్కొన్నారు..
అసలు ఆ కేసు ఏంటనే విషయానికి వస్తే.. రెండేళ్ల క్రితం.. అంటే 2020 ఫిబ్రవరిలో నిందితుడు కొందరితో కలిసి కొయిలాని ప్రాంతంలోని నంది బీచ్ వద్ద ఓ క్యాంపు ఏర్పాటు చేశాడు. ఈ క్యాంపుకు ఫిర్యాదు చేసిన మహిళ కూడా వెళ్లారు.. అంతా సరదాగా ఆ ప్రాంతంలో తిరిగేందుకు వెళ్లగా.. నిందితుడు.. ఫిర్యాదు చేసిన మహిళ చేయి పట్టుకుని లాగాడు. ఆ తర్వాత నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లాడు. మహిళ ప్రైవేట్ పాట్స్‌పై చేతులు వేసేందుకు ఒడిలో కూర్చోవాలని కోరాడు. ఈ నేపథ్యంలో ఫిర్యాదు చేసిన మహిళ.. ఐపీసీ సెక్షన్ 354 ఏ(2), 341, 354 ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.. అయితే, ఈ కేసులో తనకు బెయిల్ కావాలని కోర్టును ఆశ్రయించాడు నిందితుడు. ఈ బెయిల్ అభ్యర్థనను బాధితురాలి తరఫున వాదనలు వినిపిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ వ్యతిరేకించారు. గతంలోనూ నిందితుడు లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనలు ఉన్నాయని న్యాయస్థానం ముందు ప్రస్తావించారు. నిందితుడిపై మరో లైంగిక వేధింపుల కేసు కొనసాగుతోంది. ఓ దళిత మహిళపై వేధింపులకు యత్నించిన కేసులో అతడికి ఆగస్టు 12న బెయిల్ లభించింది. మొత్తంగా తాజాగా కోర్టు చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి.