మహారాష్ట్రలో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో తిరిగి ప్రజలు బయటకు వస్తున్నారు. కరోనా కారణంగా ఏప్రిల్ 5 నుంచి కఠిన నిబంధనలు అమలుచేయడం ప్రారంభించారు. కేసులు పెరిగిపోవడంతో లాక్‌డౌన్, కర్ఫ్యూ వంటివి కఠినంగా అమలు చేశారు. ప్రస్తుతం కేసులు తగ్గుముఖం పట్టాయి. అయితే, ఇప్పుడు మహారాష్ట్రకు మూడో వేవ్ ముప్పు భయపెడుతున్నది. కరోనా వైరస్ మ్యూటేషన్ డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు మహారాష్ట్రలో కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు అక్కడ డెల్టా ప్లస్ వేరియంట్ కేసులు ఏడు నమోదయ్యాయి.
Read: ‘ఆరడుగుల బుల్లెట్’ రాబోతోంది!
దీంతో ఆ రాష్ట్రాన్ని కోవిడ్ టాస్క్‌ఫోర్స్ హెచ్చరించింది. రత్నగిరి జిల్లాలోనే 5 కేసులు నమోదవ్వడంతో ఆ జిల్లాపై ప్రభుత్వం దృష్టి సారించింది. కొల్షాపూర్, సతారా, సాంగ్లీ, రాయ్‌గడ్, సింధ్‌దుర్గ్ జిల్లాల్లో కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. రానున్న రోజుల్లో డెల్టాప్లస్ వేరియంత్ మరింత ఆంధోళన కలిగించే విధంగా ఉండోచ్చని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ గులేరియా పేర్కొన్నారు. తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని, లేదంటే ముప్పు తీవ్రత మరింత ఎక్కువగా ఉంటుందని హెచ్చరించారు.