Site icon NTV Telugu

Security Drills: సరిహద్దు రాష్ట్రాల్లో డ్రిల్స్ వాయిదా? మళ్లీ ఎప్పుడంటే..!

Securitydrills

Securitydrills

పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో నిర్వహించాల్సిన మాక్‌డ్రిల్ మే 31కి వాయిదా పడింది. పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్, హర్యానా, రాజస్థాన్‌లో మే 29న భద్రతా విన్యాసాలు చేయాలని కేంద్రం ఆదేశించింది. పాకిస్థాన్‌తో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. కానీ కొన్ని అనివార్య కారణాల కారణంగా డ్రిల్స్‌ను మే 31కి మార్చారు. సరిహద్దు ప్రాంతాల్లో ఎదురయ్యే ముప్పులను ఎదుర్కొనేందుకే అవగాహన కల్పించడం కోసం ఈ డ్రిల్స్ చేపట్టాలని నిర్ణయం తీసుకుంది.

ఇది కూడా చదవండి: Off The Record: ఏ విషయంలో వీహెచ్ కు కోపమొచ్చింది?

మే 31 సాయంత్రం పాకిస్థాన్ సరిహద్దు జిల్లాల్లో భద్రతా సంస్థలు భద్రతా విన్యాసాలు నిర్వహిస్తాయని వర్గాలు తెలిపాయి. అవగాహన కల్పించడం లక్ష్యంగా గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, జమ్మూకాశ్మీర్‌లో ఈ విన్యాసాలు జరగనున్నాయి. పరిపాలనా కారణాల కారణంగా మే 29న జరగాల్సిన డ్రిల్స్ 31కి వాయిదా పడింది. ఇటీవల కాలంలో సరిహద్దు అవతల నుంచి భారీ దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలోనే ఈ కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో ప్రతి నెల ఇటువంటి విన్యాసాలు జరుగుతాయని వర్గాలు పేర్కొన్నాయి. విన్యాసాల సమయంలో నివాసితులు అప్రమత్తంగా ఉండాలని… అధికారులు జారీ చేసే సూచనలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

ఇది కూడా చదవండి: Covid-19: ఆ కోవిడ్ రోగిని చంపేయండి.. సీనియర్ సర్జన్ ఆడియో వైరల్

ఏప్రిల్ 22న పహల్గామ్‌లో ఉగ్రవాదులు 26 మందిని హతమార్చారు. అనంతరం భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంది. పాకిస్థాన్‌కు సింధు జలాలు నిలిపేసింది. పాక్ వీసాలను రద్దు చేసింది. అటారీ సరిహద్దును మూసేసింది. అనంతరం మే 7న భారత్.. పాకిస్థాన్‌పై ఆపరేషన్ సిందూర్ చేపట్టింది. ఈ ఘటనలో 100 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. అంతేకాకుండా పాకిస్థాన్ వైమానిక స్థావరాలు కూడా ధ్వంసమయ్యాయి.

Exit mobile version