జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదుల వేట కొనసాగుతోంది. పహల్గామ్ ఉగ్ర దాడి నుంచి భారత సైన్యం ముష్కరుల కోసం వేట కొనసాగిస్తోంది. ఇప్పటికే కీలక ఉగ్రవాదులందరినీ భారత సైన్యం హతమార్చింది.
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత భారత సైన్యం ఉగ్రవాదుల ఏరివేత కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికే పలువురు ఉగ్రవాదులను సైన్యం హతమార్చింది. పహల్గామ్ ఉగ్రవాదులు సహా పలువురు హతమయ్యారు.
పహల్గామ్ ఉగ్ర దాడి తర్వాత ఉగ్రవాద సానుభూతిపరులను భద్రతా దళాలు వేటాడుతున్నాయి. ఇప్పటికే దేశ వ్యాప్తంగా పలువురిని అదుపులోకి తీసుకున్నారు. ఇక తాజాగా ఉగ్రవాదులతో సన్నిహిత సంబంధాలు ఉన్న ముగ్గురు అధికారులపై జమ్మూకాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ వేటు వేశారు.
పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతాల్లో నిర్వహించాల్సిన మాక్‌డ్రిల్ మే 31కి వాయిదా పడింది. పంజాబ్, జమ్మూ అండ్ కాశ్మీర్, హర్యానా, రాజస్థాన్‌లో మే 29న భద్రతా విన్యాసాలు చేయాలని కేంద్రం ఆదేశించింది.
జమ్మూకాశ్మీర్‌లోని బందీపోర్‌లో ఆర్మీ వాహనానికి ప్రమాదం జరిగింది. ఆర్మీ ట్రక్కు లోయలో పడింది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు జవాన్లు గాయపడ్డారు.
హర్యానాలో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్.. సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ బూతులకు భారీగా తరలివచ్చారు. రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సామాన్య ప్రజలు పెద్ద ఎత్తున ఓటింగ్‌లో పాల్గొన్నారు. సాయంత్రం 5 గంటల వరకు 61 శాతం ఓటింగ్ నమోదు కాగా.. సాయంత్రం 6 గంటలకు ముగిసే సమయానికి భారీగానే పోలింగ్ నమోదైనట్లుగా అధికారులు భావిస్తున్నారు.
Encounter : జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఉగ్రవాదులను అదుపు చేసేందుకు భద్రతా బలగాలు భారీ ఆపరేషన్ ప్రారంభించాయి. ఈ క్రమంలో భద్రతా బలగాలు ఎనిమిది మంది ఉగ్రవాదులను మట్టుబెట్టాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు జవాన్లు కూడా వీరమరణం పొందారు.
మేఘాలయ గవర్నర్ సత్యపాల్ మాలిక్‌కు ఊహించని షాక్ తగిలింది. జమ్మూ కాశ్మీర్‌కు చెందిన PDP అధ్యక్షురాలు మహబూబా ముఫ్తీ రోష్నీ పథకం విషయంలో తప్పుడు ఆరోపణలతో తన పరువుకు భంగం కలిగించారన్నారు. నెల రోజల్లో రూ.10 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలని లేకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ డబ్బును వ్యక్తిగత ప్రయోజనాలకు ఖర్చు చేయమని, ప్రజా శ్రేయస్సు కోసం ఖర్చుపెడతామని తెలిపారు.గతంలో సత్యపాల్ మాలిక్ జమ్ము కాశ్మీర్‌కు గవర్నర్‌గా పనిచేశారు. ఆ సమయంలో రోష్నీ పథకంపై…