Site icon NTV Telugu

Loksabha: నేటి నుంచి రెండో విడత బడ్జెట్ సమావేశాలు.. స్పీకర్‌పై అవిశ్వాసం పెట్టే ఛాన్స్

Loksabha

Loksabha

నేటి నుంచి రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 2 వరకు సభ నడవనుంది. తొలి విడత సమావేశాలు చాలా హాట్ హాట్‌గా సాగాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ వ్యవహారం రచ్చ రచ్చ చేసింది. మాజీ ఆర్మీ ఆఫీసర్ మనోజ్ నరవణె రాసిన పుస్తకాన్ని సభలోకి తీసుకురావడంపై స్పీకర్ ఓం బిర్లా, కేంద్రమంత్రులు అడ్డుకున్నారు. దీంతో గందరగోళంగా మొదటి విడత సమావేశాలు ముగిశాయి.

ఇక సోమవారం నుంచి రెండో విడత సమావేశాలు కూడా ప్రారంభం అవుతున్నాయి. ఈ సమావేశాలు కూడా గరం గరంగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. తొలిరోజే స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అలాగే మధ్యప్రాచ్య యుద్ధం అంశంపై కూడా ఒక తీర్మానాన్ని తీసుకొచ్చే యోచనలో విపక్షం ఉంది.

ఓం బిర్లాకు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానంపై 118 మంది ఎంపీలు సంతకం చేశారు. స్పీకర్ పక్షపాతంతో వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షలు ఆరోపిస్తున్నాయి. అయితే అధికార పార్టీకి పూర్తి మెజార్టీ ఉంది. ఈజీగా స్పీకర్ అవిశ్వాస పరీక్షను గెలిచేస్తారు.

ఇది కూడా చదవండి: Khamenei: ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఖమేనీ కుమారుడు మోజ్తాబా నియామకం

Exit mobile version