Chandigarh: అంబేద్కర్ అంశంపై రగడ.. కొట్టుకున్న కౌన్సిలర్లు
- చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాస
- అంబేద్కర్ అంశంపై రగడ.. కొట్టుకున్న కౌన్సిలర్లు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అంబేద్కర్‌పై రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. గత వారం నుంచి దేశ వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు కొనసాగుతున్నాయి. తాజాగా ఈ అంశంపై చండీగఢ్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది. అమిత్ షాకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆందోళన చేపట్టగా.. బదులుగా జవహర్‌లాల్ నెహ్రూ హయాంలో బీఆర్ అంబేద్కర్‌కు అవమానం జరిగిందంటూ బీజేపీ ఆరోపించింది. ఇలా ఇరువర్గాల మధ్య రగడ చోటుచేసుకుంది. దీంతో కౌన్సిలర్లు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Dil Raju : శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్‌రాజు.. సమస్యను పరిష్కరించేందుకు బాధ్యత తీసుకుంటా
Also Read
- Thackeray Brothers: ఠాక్రే బ్రదర్స్ 'విరాట్ గర్జన'.. ఎన్నికల సంఘంపై విపక్షాల ఉమ్మడి పోరాటం!
- BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
- Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
- CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
రాజ్యసభలో అమిత్ షా మాట్లాడుతూ.. అంబేద్కర్ కొందరికి ఫ్యాషన్ అయిపోయిందని.. అంబేద్కర్ పేరు తలుచుకునే బదులు.. భగవంతుడి పేరు తలుచుకుంటే స్వర్గంలో పుణ్యమైన దొరుకుతుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలే తీవ్ర దుమారం రేపాయి. అంబేద్కర్‌ను అవమానించారంటూ కాంగ్రెస్ సహా విపక్షాలు ఆందోళనకు దిగారు. పార్లమెంట్ ఆవరణలో ఎంపీల మధ్య ఘర్షణ కూడా చోటుచేసుకుంది. తాజాగా ఇదే అంశంపై చండీఘడ్ మున్సిపల్ కార్పొరేషన్‌లో కూడా రిపీట్ అయింది. కౌన్సిలర్లు మధ్య తీవ్ర వాగ్వాదానికి దారితీసింది. నేషనల్ హెరాల్డ్ కేసును ఉదహరిస్తూ నామినేటెడ్ కౌన్సిలర్ అనిల్ మాసిహ్ కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని రాహుల్ గాంధీ బెయిల్‌పై బయట ఉన్నారని పేర్కొన్నారు. ఇంతలో కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దాదాపు 20 నిమిషాల పాటు కౌన్సిలర్లు భౌతికంగా కలబడ్డారు.
#WATCH | Scuffle erupted between Congress and BJP councillors over the subject of Dr BR Ambedkar during the general house meeting of Chandigarh Municipal Corporation today
Nominated councillor Anil Masih had targeted Congress and stated that Rahul Gandhi is out on bail, citing… pic.twitter.com/iZmLidgbT0
— ANI (@ANI) December 24, 2024
తాజావార్తలు
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
-
Chanchalguda Jail : చంచల్‌గూడ జైలు సూపరింటెండెంట్‌పై ఆరోపణలు.. జైళ్ల శాఖ క్లారిటీ
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!