SC Categorisation: శెభాష్ కాంగ్రెస్. బీజేపీ, టీఆర్ఎస్‌లను ఇరుకునపెట్టే ఎత్తుగడ. ఎస్సీల వర్గీకరణ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
SC Categorisation: షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్ల వర్గీకరణ అంశం మళ్లీ తెరమీదికి రాబోతోంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు హయాంలో అమలైన ఏబీసీడీ వర్గీకరణ 2004లో కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావటంతో నిలిచిపోయింది. సుప్రీంకోర్టు బ్రేక్ వేయటమే దీనికి ప్రధాన కారణం. అయితే దీనిపై ఉషామెహ్రా కమిటీ అభిప్రాయ సేకరణ జరిపి 2008లో కేంద్రానికి నివేదిక ఇచ్చింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 341కు సవరణ చేయాలని, 3వ క్లాజును చేర్చడం ద్వారా అసెంబ్లీలు ఏకగ్రీవ తీర్మానం చేస్తే వర్గీకరణ బిల్లును పార్లమెంట్ ఆమోదించవచ్చని ఉషా మెహ్రా కమిటీ సిఫారసు చేశారు.
అయితే 2014 వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ దీన్ని పట్టించుకున్న దాఖలాల్లేవు. దీంతో అదే ఏడాది జరిగిన సాధారణ ఎన్నికల ప్రచారంలో బీజేపీ తాము అధికారంలోకి వస్తే 100 రోజుల్లోనే ఎస్సీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చింది. ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చి ఇప్పటివకి 8 ఏళ్లు దాటింది. అయినా ఆ దిశగా ఒక్క అడుగూ ముందుకు పడలేదు. ఈ లోగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్‌లో హస్తం పార్టీ ఉనికి కోసం పోరాడుతుండగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మళ్లీ ఈ అంశాన్ని పార్లమెంట్ వేదికగా చర్చించాలని భావిస్తోంది.
Also Read
- Notifications Cancelled: సంచలన నిర్ణయం తీసుకున్న జార్ఖండ్ ప్రభుత్వం.. 44 నియామక పరీక్షలు రద్దు..
- Punjab Politics: ఆప్‌పై బీజేపీ డెడ్లీ స్కెచ్.. కేంబ్రిడ్జ్ సైంటిస్ట్ చుట్టూ పంజాబ్ రాజకీయం.. ఎవరీ సందీప్ పాఠక్?
- PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ 25 ఏళ్ల ప్రజా సేవ.. దేశవ్యాప్తంగా ‘సేవా సంకల్ప్ మహోత్సవ్’కు బీజేపీ సన్నాహాలు
- CM Vijay: మహిళా ఉద్యోగులకు రక్షా బంధన్ శుభవార్త.. మూడో బిడ్డకు ఏడాది ప్రసూతి సెలవు
Record Level Car Sales: దూసుకెళ్లిన కార్ల విక్రయాలు.. రెండేళ్ల కిందటి రికార్డు బద్ధలు..
తద్వారా ఇటు తెలంగాణలో అధికార పార్టీ టీఆర్‌ఎస్‌ను, అటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఏక కాలంలో ఇరుకున పెట్టడానికి ఎత్తుగడ వేస్తోంది. ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టి ఆమోదించాలని, ఈ మేరకు కాంగ్రెస్ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని తెలంగాణ కాంగ్రెస్ పార్టీలోని మాదిగ సామాజిక వర్గం నేతలు కోరుతున్నారు. ఈ మేరకు నిన్న సోమవారం హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీకి మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ నేతృత్వంలో వహించారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్కం ఠాగూర్, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని సంపత్ నాయకత్వంలోని ప్రతినిధి బృందం ఇవాళ మంగళవారం ఢిల్లీలో కలవాలని తీర్మానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ, సిరిసిల్ల రాజయ్య, జె.గంగారాం, కె.సత్యనారాయణ, పీసీసీ ఎస్సీ సెల్ ఛైర్మన్ ఎన్.ప్రీతంతోపాటు వివిధ జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఇతర నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కేంద్రమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ కోసం కొంత ప్రయత్నం చేశారు.
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కూడా పలుమార్లు మద్దతు పలికారు. ప్రధాని నరేంద్ర మోడీ దృష్టికి తీసుకెళతానని హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ కార్యరూపం దాల్చలేదు. తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం ఎస్సీ వర్గకరణ అంశాన్ని తానే హ్యాండిల్ చేస్తానని గతంలో అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఎస్సీల వర్గీకరణ కోసం పోరాడుతున్న ఎంఆర్‌పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పనైపోయిందంటూ ఎద్దేవా చేసిన ఆయన ఇప్పుడు దీన్ని పట్టించుకోవట్లేదు. దీంతో క్రెడిట్ కొట్టేయాలని తెలంగాణ కాంగ్రెస్ తాజాగా ప్రణాళికలు సిద్ధం చేసింది.
తాజావార్తలు
-
కొత్త కలర్స్, TFT డిస్‌ప్లే, నావిగేషన్‌తో Yamaha 125cc 2026 మోడల్స్ స్కూటర్లలో కీలక అప్డేట్స్..!
-
Jailer 2 OTT Deal: రిలీజ్ కు ముందే రజనీకాంత్ ‘జైలర్ 2’ సంచలనం.. రూ.160 కోట్ల ఓటీటీ డీల్?
-
Chittoor: చిత్తూరు జిల్లాలో అమానుష ఘటన.. తండ్రి మృతదేహానికి తలకొరివి పెట్టని కన్నకొడుకు.. కారణం ఏంటంటే?
-
Vivo Y31T 5G: 7200mAh బ్యాటరీతో Vivo Y31T 5G.. 120Hz స్క్రీన్, 50MP కెమెరా.. ఫీచర్లు, స్పెసిఫికేషన్స్ ఇవే
-
ED Summons : రామ్మా చిలకమ్మా.. నిధి అగర్వాల్ కు ఈడీ పిలుపు..
ట్రెండింగ్
-
గూర్ఖా రెజిమెంట్‌కు నివాళిగా కొత్త Royal Enfield Classic 350 Gorkha ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vijaysai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా!
-
India All-Time Test XI: భారత్ ఆల్‌టైమ్ బెస్ట్ టెస్టు ఎలెవన్.. కెప్టెన్‌గా కింగ్.. ధోనీ, జడేజాలకు షాక్!
-
9,100mAh బ్యాటరీ, 2K 144Hz డిస్‌ప్లే, Dimensity 9500Mతో iQOO Neo11 Ultra లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
రిమూవబుల్ బ్యాటరీ, LTPO AMOLED డిస్‌ప్లే, ఐదేళ్ల వారంటీతో Fairphone Gen. 6+ లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!