Electoral bonds: సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని ఈ రోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) వివరాలను కేంద్రం ఎన్నికల సంఘానికి అందించింది. బాండ్లకు సంబంధించి అన్ని ముఖ్యమైన ప్రత్యేక నంబర్లను కూడా అందించింది. ఇది నిధులు ఇచ్చిన దాతలు, తీసుకున్న పార్టీల వివరాలను సరిపోల్చడానికి సహాయపడుతుంది. బ్యాంక్ ఇచ్చిన వివరాలను ఎన్నికల సంఘం త్వరలో తన వెబ్‌సైట్‌లో పొందుపరుచనుంది. అకౌంట్ నంబర్, కేవైసీ డిటెయిల్స్ వెల్లడి కానున్నాయి.
Read Also: Women Employment: మహిళా ఉపాధిలో అగ్రస్థానంలో హైదరాబాద్.. తర్వాత స్థానంలో నగరాలు ఇవే..
ఇప్పటికే ఎస్‌బీఐ రెండు జాబితాలు ఈసీకి ఇచ్చింది. పోల్ ప్యానెల్ వీటిని మార్చి 14న తన వెబ్‌సైట్‌లో విడుదల చేసింది. మొదటి జాబితాలో దాతల పేర్లు, బాండ్ల విలువ, వాటిని కొనుగోలు చేసిన తేదీలు ఉన్నాయి. అయితే, యూనిక్ నెంబర్ లేకుండా ఇవ్వడాన్ని సుప్రీం తప్పుపట్టడంతో తాజాగా వీటికి సంబంధించిన వివరాలను కూడా ఎస్‌బీఐ ఇచ్చింది.
ఇప్పటికే ఈ ఎలక్టోరల్ బాండ్ల విషయం రాజకీయంగా పెనుదుమారాన్ని రేపుతోంది. బీజేపీకి అన్ని పార్టీల కన్నా ఎక్కువ నిధులు రావడంతో ప్రతిపక్షాలు ఆ పార్టీ టార్గెట్‌గా విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ బాండ్ల ద్వారా అధికార బీజేపీకి గరిష్టంగా రూ. 6986.5 కోట్ల నిధులు అందాయి. ఆ తర్వాత స్థానంలో పశ్చిమ బెంగాల్ అధికార పార్టీ తృణమూల్ కాంగ్రెస్ (రూ. 1,397 కోట్లు), కాంగ్రెస్ (రూ. 1,334 కోట్లు), BRS (రూ. 1,322 కోట్లు) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఒడిశాలో అధికార పార్టీ బీజేడీకి రూ. 944.5 కోట్లు, డీఎంకేకి రూ. 656.5 కోట్లు, వైస్సార్సీపీకి రూ. 442.8 కోట్ల నిధులు అందాయి. ఈ బాండ్ల ద్వారా టీడీపీకి రూ. 181.35 కోట్లు, శివసేనకు రూ. 60.4 కోట్లు, ఆర్జేడీకి రూ. 56 కోట్లు, సమాజ్‌వాదీ పార్టీకి రూ. 14.05 కోట్లు, అకాలీదళ్‌కి రూ. 7.26 కోట్లు, ఏఐడీఎంకేకీ రూ. 6.05 కోట్లు, నేషనల్ కాన్ఫరెన్స్‌కి రూ. 50 లక్షలు అందాయి.
