Saudi Arabia: సౌదీలో బంగ్లాదేశ్ జంటకు మరణశిక్ష.. భారతీయుడి ప్రమేయం ఉందని పాక్ నెటిజన్ల ప్రచారం.!
- సౌదీ అరేబియాలో బంగ్లాదేశ్ జంటకు మరణశిక్ష..
- మక్కా మసీదులో అనైతిక చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణ..
- భారతీయుడే వీడియో తీశాడరంతో పాకిస్తాన్ సోషల్ మీడియా ప్రచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saudi Arabia: సౌదీ అరేబియాలో బంగ్లాదేశ్‌కు చెందిన నజ్రుల్ ఇస్లాం, స్వీటీ అక్తర్ అనే ఇద్దరికి ‘‘మరణశిక్ష’’ అమలు చేయడం ప్రపంచవ్యాప్తంగా సంచలనంగా మారింది. వీరిద్దరు పవిత్ర మక్కా మసీదు ప్రాంగణంలో ‘‘అనైతిక చర్యల’’లకు పాల్పడటంతో ఉరిశిక్ష అమలు చేసినట్లు సౌదీ అధికారులు చెబుతున్నారు. అయితే, ఈ శిక్ష అమలు గురించి తమకు సమాచారం లేదని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఆరోపిస్తోంది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలనను సౌదీ అరేబియా పంచుకోకపోవడంపై పలు అనుమానాలు తలెత్తుతున్నాయి.
ఇదిలా ఉంటే, ఓ భారతీయుడు ఈ ఘటనకు కారణమంటూ పాకిస్తాన్‌కు చెందిన కొన్ని సోషల్ మీడియా అకౌంట్లలో తప్పుడు ప్రచారం మొదలైంది. ఇదే కథనాన్ని బంగ్లాదేశ్, పాకిస్తాన్‌తో పాటు ఇతర దేశాలకు చెందిన సోషల్ మీడియా అకౌంట్లు ప్రచారం చేశాయి. అయితే, ఈ ఆరోపణలకు మద్దతుగా ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
Also Read
- BJP: సంచలన రిపోర్ట్.. రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌పై ‘‘రెజిమ్ ఛేంజ్’’ ఆరోపణలు..
- Saudi Arabia: సౌదీ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత పౌరుడు మృతి..
- Amit shah: ఇంకో 30 ఏళ్ల వరకు అధికారంలోకి రారు.. రాహుల్‌గాంధీ టూర్‌పై అమిత్ షా విమర్శలు
- Dawood Ibrahim: ‘‘బిన్ లాడెన్ దొరికిన దేశంలోనే దావూద్ ఇబ్రహీం’’.. UN రిపోర్ట్‌పై భారత్ అభ్యంతరం..
భారతీయుడు ఈ చర్యను వీడియో తీశాడా.?
అక్టోబర్ 20 నుంచి ఈ ప్రచారం మొదలైంది. మక్కాలోని మస్జిద్ అల్ హరామ్లో క్లీనర్లుగా పనిచేసిన నజ్రుల్, స్వీటీ మధ్య ప్రేమ బంధం ఏర్పడిందనే ఆరోపణలు ఉన్నాయి. మసీదులోని 85,87 గేట్ల మధ్య ఉన్న ఏకాంత గదిలో ఇద్దరు కలిసి అనైతిక చర్యకు పాల్పడుతున్న సమయంలో నజ్రుల్ తన భారతీయ స్నేహితుడిని బయట కాపలాగా ఉంచాడని, ఆ వ్యక్తి వారి వీడియో తీశాడని సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది.
ఆ తర్వాత స్వీటీని బ్లాక్మెయిల్ చేయడంలో విఫలమైన భారత వ్యక్తి ఈ వీడియోను అధికారులకు పంపించాడనే ప్రచారం ఉంది. సౌదీ అధికారులు ముగ్గురిని అరెస్ట్ చేసి, భారతీయ వ్యక్తికి 20 ఏళ్లు జైలు శిక్ష విధించగా, నజ్రుల్, స్వీటీకు మరణశిక్ష అమలు చేశారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
పాకిస్తాన్ సోషల్ మీడియా అకౌంట్లలో ప్రచారం..
ఈ ఆరోపణలు ముందుగా పాకిస్తాన్, బంగ్లాదేశ్‌కు చెందిన కొన్ని ఫేస్బుక్, ఎక్స్ అకౌంట్లలో వెలుగులోకి వచ్చాయి. సౌదీలోని రియాద్‌లో పాకిస్తాన్ ముస్లిం లీగ్-నవాజ్ యూత్ వింగ్ అధ్యక్షుడు ఫర్హాన్ కియానీ కూడా ఈ పోస్టుల్ని షేర్ చేసిన వ్యక్తుల్లో ఉన్నాడు. దీని తర్వాత నైజీరియా, ఆఫ్ఘనిస్తాన్ సహా ఇతర దేశాలకు చెందిన సోషల్ మీడియాలో ఈ వార్త ప్రచారం జరిగింది.
సౌదీ అరేబియా ఏం చెబుతోంది.?
సౌదీ లోని బంగ్లాదేశ్ కాన్సులేట్ వద్ద ఉన్న సమాచారం ప్రకారం.. స్వీటీ, నజ్రుల్ ఇద్దరు అల్ మజర్ అనే సౌదీ సంస్థలో క్లీనర్లుగా పనిచేస్తున్నారు. సెప్టెంబర్ 30న కాన్సులేట్‌కు అందిన సమాచారం ప్రకారం.. నజ్రుల్‌ను 2023 ఆగస్టు 1న సౌదీ సైబర్ నేరాల చట్టం కింద అదుపులోకి తీసుకున్నారు. తర్వాత రోజు స్వీటిని వ్యభిచారం కేసులో అరెస్ట్ చేశారు. అయితే, వీరిద్దరిపై వచ్చిన ఆరోపణల్ని ఇరు కుటుంబాలు ఖండించాయి. నజ్రుల్‌ను పాకిస్తాన్‌కు చెందిన సహోద్యోగి కుట్రలో ఇరికించాడని అతడి బంధువులు ఆరోపించారు. కొందరు మహిళా సహోద్యోగులు అక్రమంగా కారు కొనుగోలు చేసిన తర్వాత స్వీటీని అరెస్ట్ చేశారని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సౌదీ అరేబియా మాత్రం వీరిద్దరు అనైతిక చర్యలకు పాల్పడినట్లు ఆరోపించి మరణశిక్ష అమలు చేసింది.
తాజావార్తలు
-
Saudi Arabia: సౌదీలో బంగ్లాదేశ్ జంటకు మరణశిక్ష.. భారతీయుడి ప్రమేయం ఉందని పాక్ నెటిజన్ల ప్రచారం.!
-
వృద్ధుల కోసం AI ఫీచర్ ఫోన్.. ‘మేరీ’తో HMD 2660 Flip Senior Edition లాంచ్.!
-
BJP: సంచలన రిపోర్ట్.. రాహుల్ గాంధీ, కాంగ్రెస్‌పై ‘‘రెజిమ్ ఛేంజ్’’ ఆరోపణలు..
-
Gunshots Fired: నందలూరులో నామినేషన్ల రగడ.. గాల్లోకి కాల్పులు, కార్లకు నిప్పు!
-
Harish Rao : ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కృత్రిమ కరువు
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!