Sanjay Raut: ప్రధాని మోడీ చూస్తే యుద్ధం చేసేలా కనిపించడం లేదు..
- మోడీని చూస్తే యుద్ధం చేసేలా కనిపించడం లేదు..
- అమిత్ షా ఉగ్రదాడికి బాధ్యతగా రాజీనామా చేయాలి.. ఠాక్రే శివసేన నేత సంజయ్ రౌత్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sanjay Raut: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో శివసేన (ఠాక్రే) నేత సంజయ్ రౌత్ ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ బాడీ లాంగ్వేజ్ చూస్తే ఆయన పాకిస్తాన్‌తో యుద్ధం చేసేలా లేరని అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ కాశ్మీర్లో పెద్ద ఊచకోత జరిగింది. మన ప్రధాన మంత్రి పాకిస్తాన్‌కి గుణపాఠం నేర్పుతామని చెప్పారు. కానీ కొద్ది రోజుల తర్వాత, మోడీ ముంబైలో బాలీవుడ్ ప్రముఖలతో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన బీహార్‌లో ప్రచారం చేసి గౌతమ్ అదానీ పోర్టు ప్రారంభోత్సవం కోసం కేరళ వెళ్లారు’’ అని అన్నారు.
Read Also: Pakistan: బలూచిస్తాన్‌లో ముగిసిన పాక్ ఆట.. బీఎల్ఏ ఆధీనంలో పట్టణాలు, ప్రభుత్వ భవనాలు..
Also Read
- Tamil Nadu CM Vijay: సీఎం విజయ్ భారీ ప్యాకేజీ.. ఎమ్మెల్యేలకు కొత్త కార్లు, రూ.1 లక్ష భత్యం, రూ.25 లక్షల ఆరోగ్య బీమా
- Khandwa Stray Dog Menace: ‘డాగీ బ్రదర్’ వినూత్న నిరసన.. కుక్క వేషధారణలో కలెక్టరేట్‌కు.. అసలు కారణం ఇదే! (వీడియో)
- Notifications Cancelled: సంచలన నిర్ణయం తీసుకున్న జార్ఖండ్ ప్రభుత్వం.. 44 నియామక పరీక్షలు రద్దు..
- Punjab Politics: ఆప్‌పై బీజేపీ డెడ్లీ స్కెచ్.. కేంబ్రిడ్జ్ సైంటిస్ట్ చుట్టూ పంజాబ్ రాజకీయం.. ఎవరీ సందీప్ పాఠక్?
ప్రధాని మోడీ బాడీ లాంగ్వేజ్ చూస్తే పాకిస్తాన్‌పై కఠినంగా స్పందించే వ్యక్తిలా కనిపించడం లేదని సంజయ్ రౌత్ ఆరోపించారు. పాకిస్తాన్‌తో ఎలా స్పందించాలో అని మేమంతా ఆందోళన చెందుతుంటే, మోడీ మాత్రం ఉల్లాసంగా ఉన్నారని ఆయన అన్నారు. దేశంలో జరుగుతున్న యుద్ధ విన్యాసాలు, సాధారణంగా ఎప్పుడూ జరిగేవే అని అన్నారు.
ఇదే సమయంలో, బీజేపీ యుద్ధ భాష మాట్లాడుతోందని చెప్పారు. రక్షణ మంత్రి పాకిస్తాన్‌ని తుడిచిపెడుతామని చెబుతున్నారు, హోం మంత్రి అమిత్ షా ఉగ్రవాదుల్ని వదిలిపెట్టమని చెబుతున్నారు, మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు..? అని ప్రశ్నించారు. గత 10 ఏళ్లలో కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడికి అమిత్ షా బాధ్యత వహించి, రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఒక వేళ పార్లమెంట్లో చర్చ జరిగినా, పహల్గామ్ దాడిపై మాట్లాడేందుకు ప్రభుత్వం ప్రతిపక్షాలను అనుమతించదని అన్నారు.
తాజావార్తలు
-
Fast Forever: 25 ఏళ్ల ప్రయాణానికి గ్రాండ్ ఫినాలే.. ‘ఫాస్ట్ ఫరెవర్’పై భారీ అప్డేట్
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!
-
Ind Vs SL: ఆల్‌రౌండ్ ప్రదర్శనతో భారత్ ఘన విజయం.. శ్రీలంక చిత్తు చిత్తు..
-
MS Dhoni-CSK: సీఎస్కే అభిమానులకు శుభవార్త.. ఇక అంతా ఎంఎస్ ధోనీనే!
-
Oppo A7 Pro 5G: ఒప్పో A7 ప్రో 5G లాంచ్‌కు రెడీ?.. 8GB RAM, 256GB స్టోరేజ్.. ఈ ఫోన్ ఫీచర్లు ఇవే!
ట్రెండింగ్
-
8000mAh బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో ఆగస్టు 26న వచ్చేస్తోన్న Realme P4s 5G..!
-
Green Chillies at Home: మార్కెట్ మిరపకాయలకు బై.. బై.. ఇంటి కుండీలోనే తాజా పచ్చిమిరపకాయలు పెంచండి ఇలా.!
-
కొత్త కలర్స్, TFT డిస్ప్లే, నావిగేషన్‌తో Yamaha 125cc 2026 మోడల్స్ స్కూటర్లలో కీలక అప్డేట్స్..!
-
గూర్ఖా రెజిమెంట్‌కు నివాళిగా కొత్త Royal Enfield Classic 350 Gorkha ఎడిషన్ విడుదల.. ధర, ఫీచర్లు ఇవే!
-
Vijaysai Reddy: కొత్త రాజకీయ పార్టీ పెడుతున్నా.. త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తా!