Sanjay Raut: పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో శివసేన (ఠాక్రే) నేత సంజయ్ రౌత్ ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోడీ బాడీ లాంగ్వేజ్ చూస్తే ఆయన పాకిస్తాన్‌తో యుద్ధం చేసేలా లేరని అన్నారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘ కాశ్మీర్‌లో పెద్ద ఊచకోత జరిగింది.
జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో మంగళవారం పర్యటకులపై దాడి జరిగిన విషయం తెలిసిందే. జమ్మూ కశ్మీర్‌లోని పహల్గాంలో పర్యటకులపై తీవ్రవాదులుగా భావిస్తున్న వారి దాడి జరిగింది. ఈ దాడిలో ఇప్పటి వరకు దాదాపు 28 మంది పర్యటకులు మరణించినట్లు తెలుస్తోంది. మీడియాలో కనిపిస్తున్న కొన్ని వీడియోలలో దుండగులు ముస్లిమేతరులను ప్రత్యేకంగా టార్గెట్ చేసుకుని దాడి చేశారని బాధితులు చెప్పడం కనిపించింది. ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఊహాచిత్రాలు బయటకు వచ్చాయి. ముగ్గురు ఉగ్రవాదులను ఆసిఫ్ ఫుజి, సులేమాన్ షా,…