Fast Forever: 25 ఏళ్ల ప్రయాణానికి గ్రాండ్ ఫినాలే.. ‘ఫాస్ట్ ఫరెవర్’పై భారీ అప్డేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fast Forever: హాలీవుడ్ యాక్షన్ సినిమాల గురించి మాట్లాడితే ‘ది ఫాస్ట్ అండ్ ది ఫ్యూరియస్’ పేరు లేకుండా ఆ జాబితా పూర్తి కాదు. స్ట్రీట్ రేసింగ్ కథతో మొదలైన ఈ ఫ్రాంచైజీ, కాలక్రమేణా ప్రపంచవ్యాప్తంగా బిలియన్ల డాలర్ల వసూళ్లు సాధించిన ఒక యాక్షన్ సిరీస్‌గా ఎదిగింది. ఇప్పుడు 25 ఏళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న ఈ లెజెండరీ ఫ్రాంచైజీ తన చివరి అధ్యాయానికి చేరుకుంది. ‘ఫాస్ట్ ఫరెవర్’ పేరుతో రానున్న గ్రాండ్ ఫినాలేపై విన్ డీజిల్ చేసిన తాజా ప్రకటన అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ‘ది ఫాస్ట్ అండ్ ది ఫ్యూరియస్’ తొలి సినిమా 2001 జూన్ 22న విడుదలైన సందర్భంగా 25వ వార్షికోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ మైలురాయిని గుర్తు చేసుకుంటూ తొలి చిత్రాన్ని 2026 ఆగస్టు 21న అంతర్జాతీయంగా మళ్లీ థియేటర్లలో విడుదల చేయనున్నారు మేకర్స్. రీ రిలీజ్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక ప్రదర్శనలను కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఇటీవల కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో ఈ క్లాసిక్‌కు అర్ధరాత్రి స్క్రీనింగ్ నిర్వహించడం ఈ వేడుకలకు మరింత ప్రత్యేకత తీసుకొచ్చింది.
లాస్ ఏంజిల్స్‌లో జరిగిన 25వ వార్షికోత్సవ కార్యక్రమంలో విన్ డీజిల్ అభిమానులకు పెద్ద సర్ప్రైజ్ ఇచ్చారు. ‘ఫాస్ట్ ఫరెవర్’ స్క్రిప్ట్ పూర్తయిందని ప్రకటించిన ఆయన, ఈ ఏడాది డిసెంబర్లో సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని వెల్లడించారు. అంతేకాదు ఈ మూవీని 2028 మార్చి 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. దీంతో చాలా కాలంగా ఈ సినిమాపై వస్తున్న ఊహాగానాలకు తెరపడినట్లైంది. ఈ ప్రకటనతో అభిమానులు కూడా ఫుల్ జోష్ మీద ఉన్నారు. ఎందుకంటే 25 ఏళ్లుగా సాగుతున్న ఈ ప్రయాణం ఇప్పుడు చివరి మలుపులోకి అడుగుపెడుతోంది. డొమినిక్ టొరెట్టో పాత్రలో విన్ డీజిల్, భారీ యాక్షన్ సన్నివేశాలు, హైస్పీడ్ కార్ చేజ్లు కలిసి ఈ ఫ్రాంచైజీని ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో నిలబెట్టాయి. ఇప్పుడు వస్తున్న చివరి సినిమాలో ఇంతకు ముందు దానికంటే యాక్షన్ సీక్వెన్స్, ఛేజింగ్ సీన్స్ ఉంటాయని అభిమానులు భావిస్తున్నారు.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
2001లో స్ట్రీట్ రేసింగ్ కథగా ప్రారంభమైన ఈ సిరీస్, ఇప్పటివరకు మొత్తం 11 సినిమాలను ప్రేక్షకుల ముందుకు తెచ్చింది. ఇప్పుడు ‘ఫాస్ట్ ఫరెవర్’ తో ఈ లెజెండరీ ప్రయాణానికి ముగింపు పలకనున్న చివరి భాగంగా ‘ఫాస్ట్ ఫరెవర్’ నిలవనుంది. ఇప్పుడు దీని స్క్రిప్ట్ పూర్తవడం, షూటింగ్ టైమ్‌లైన్ ప్రకటించడం, రిలీజ్ డేట్ ఖరారవడంతో అభిమానుల్లో మాత్రం ఉత్సాహం ఉరకలు వేస్తోంది. 25 ఏళ్లుగా అలరిస్తున్న ‘ఫాస్ట్ అండ్ ది ఫ్యూరియస్’ ఫ్రాంచైజీ ఇప్పుడు ‘ఫాస్ట్ ఫరెవర్’తో తన ప్రయాణాన్ని ఎలా ముగిస్తుందన్నది ప్రపంచవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. పిల్లల నుంచి, పెద్దల దాకా అలరించిన సినిమా కాబట్టి, ఈసారి భారీ అంచనాలతో ‘ఫాస్ట్ ఫరెవర్’ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడం గ్యారంటీనే.
- Tags
- cinema
- Fast Forever
తాజావార్తలు
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
-
WI Vs Ind: ముగిసిన వెస్టిండీస్ బ్యాటింగ్.. భారత్ టార్గెట్ 172 పరుగులు..
-
Uday Krishna Reddy : ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి షరతులతో కూడిన బెయిల్
-
SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!