Site icon NTV Telugu

Sanjay Raut: రూటు మార్చిన సంజయ్ రౌత్.. దేవేంద్ర ఫడ్నవీస్‌పై ప్రశంసలు..

Sanjay Raut

Sanjay Raut

Sanjay Raut Praises BJP’s Devendra Fadnavis: పత్రాచల్ భూముల కుంభకోణంలో 103 రోజుల పాటు జైలులో ఉన్నాడు శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం కీలక నేత సంజయ్ రౌత్. ఈ కేసులో ఈడీ అరెస్ట్ చేసి జైలుకు తరలించింది. అయితే నిన్న జైలు నుంచి విడుదలయ్యారు సంజయ్ రౌత్. బీజేపీ అంటేనే విరుచుకుపడే సంజయ్ రౌత్.. ఆ పార్టీ కీలక నేత దేవేంద్ర ఫడ్నవీస్ పై ప్రశంసలు కురిపించారు. అయితే జైలు నుంచి విడుదలైన తర్వాత రూటు మార్చిన సంజయ్ రౌత్.. బీజేపీ నేతను పొగడటం చర్చనీయాంశంగా మారింది. మళ్లీ బీజేపీతో కలిసేందుకు సిద్ధం అవుతున్నారా..? అనే వాదనలు ఉన్నాయి.

మూడు నెలల తర్వాత జైలు నుంచి విడుదలైన తర్వాతి రోజే సంజయ్ రౌత్ గురువారం రోజు డిఫ్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పై ప్రశంసలు కురిపించారు. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఉంది.. కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటుందని.. దేవేంద్ర ఫడ్నవీస్ కొన్ని మంచి నిర్ణయాలు తీసుకున్నారని..పేదలకు గృహ నిర్మాణం వంటి నిర్ణయాలను ప్రశంసించారు. మహారాష్ట్ర హౌసింగ్ అండ్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీకి మరన్ని హక్కులు కల్పించాలనే నిర్ణయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. మా ప్రభుత్వం ఉన్న సమయంలో ఆ హక్కుల్ని తొలగించామని.. నాకు అది నచ్చలేదని.. ఫడ్నవీస్ వీటిని పునరుద్దరించడం మంచి విషయమని సంజయ్ రౌత్ అన్నారు.

Read Also: India vs England: భారత్ ఘోర పరాజయం.. చెప్పినట్లే చితక్కొట్టిన ఇంగ్లండ్

త్వరలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షాలను కలుస్తానని.. నా విషయంలో ఏం జరిగిందో వారికి చెబుతా అని అన్నారు. రాజకీయ విద్వేషాలు తగ్గించుకోవాలని దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన వ్యాఖ్యలను ఆయన స్వాగతిస్తున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉంటే డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పై ప్రశంసలు గుప్పిస్తూనే.. సీఎం ఏక్ నాథ్ షిండే పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. ఏక్ నాథ్ షిండే శివసేనలో చీలిక తెచ్చినప్పుడు, సంజయ్ రౌత్ బీజేపీని, ఏక్ నాథ్ షిండేను తీవ్రస్థాయిలో విమర్శించారు.

విడుదలైన తర్వాత బీజేపీపై కానీ.. ఈడీపై కానీ ఎలాంటి విమర్శలు చేయలేదు సంజయ్ రౌత్. తన కుటుంబం కష్టాల్లో ఉందని అన్నారు. మూడు నెలల కాలంలో ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్ లు నాతో ఫోన్ లో మాట్లాడారని ఆయన అన్నారు. ఏళ్ల తరబడి జైలు జీవితం గడిపిన వీడీ సావర్కర్‌, బాలగంగాధర్‌, అటల్‌ బిహారీ వాజ్‌పేయి నుంచి తాను స్ఫూర్తి పొందానని చెప్పారు. “రాజకీయాల్లో ఎవరున్నా ఏదో ఒక సమయంలో జైలుకు వెళ్లాల్సిందేనని అని అన్నారు.

Exit mobile version